బిజినెస్

కంపెనీ చట్టం సవరణ బిల్లుకు ఆమోద ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: కంపెనీల చట్టం సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. డొల్ల కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైన అన్ని అంశాలను ఈ సవరణ బిల్లులో చేర్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అదే విధంగా కార్పొరేట్ రంగ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)ను కఠిన తరంగా అమలు చేసేలా ఈ సవరణలో కొన్ని అంశాలను చేర్చడం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల డొల్ల (షెల్) కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్టు ఆమె లోక్‌సభలో ప్రకటించారు. సీఎస్‌ఆర్ కింద ప్రతి కంపెనీ తన నికర లాభంలో రెండు శాతం మొత్తాన్ని ప్రజా సంక్షేమం కోసం డిపాజిట్ చేయాలని చట్టం స్పష్టం చేస్తున్నది. అయితే, కార్పొరేట్ కంపెనీలు చాలా వరకూ ఈ నిబంధనను పాటించడం లేదు. ఇకపై అలాంటి నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించేది లేదని సీతారామన్ తేల్చిచెప్పారు. వ్యాపార నిర్వాహణ సజావుగా సాగేందుకు ఈ సవరణలు ఉపయోగపడతాయని అన్నారు. కంపెనీల చట్టం సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించిన తర్వాత, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరీ లేవనెత్తిన కొన్ని అభ్యంతరాలకు మంత్రి సీతారామన్ వివరణ ఇచ్చారు. డొల్ల కంపెనీలు అనే పేరు కంపెనీల చట్టంలో లేదని ఆమె స్పష్టం చేశారు. వాటిని ‘పని చేయని కంపెనీలు’ లేదా ‘క్రీయాశీలకంగా లేని కంపెనీలు’గా అభివర్ణించినట్టు తెలిపారు. ఏదైనా కంపెనీ 5 కోట్ల రూపాయలకు మించి లాభాలను ఆర్జించినా, 100 కోట్ల రూపాయలకు మించి టర్నోవర్‌ను నమోదు చేసినా, ఐదు కోట్ల రూపాయల నికర విలువ కలిగి ఉన్నా, సదరు కంపెనీలు రెండు శాతం మొత్తాన్ని ప్రజా ప్రయోజనాల కోసం డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఈ మొత్తాలను ప్రధాని సహాయ నిధికి మళ్లించి, అవసరాలకు అనుగుణంగా వాడనున్నట్టు చెప్పారు.