బిజినెస్

ఐటీ పాలసీలోనూ ఇన్‌సైడ్ ట్రేడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: గత ఐదేళ్ల పాలనలో ఐటీ రంగానికి ఎంతో అనువైన విశాఖ నగరాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు అణగదొక్కారని శాసనసభలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రులు సమాధానమిచ్చారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఐటీ పరిశ్రమకు తగిన ప్రదేశంగా విశాఖ ఉన్నప్పటికీ ఆ నగరంలో ఐటీని ఉద్దేశ పూర్వకంగానే అభివృద్ధి చేయలేదంటూ తప్పుబట్టారు. విశాఖను అభివృద్ధి చేయాలనే ధ్యాస బాబుకు ఏ మాత్రం లేదన్నారు. దీనికి కారణం ఏమిటంటే తమకు నచ్చిన చోట ఐటీ కంపెనీలు పెట్టాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి చేశారని, తీరా అక్కడి వాతావరణం అనుకూలంగా లేదంటూ ఏ ఒక్క ఐటీ కంపెనీ ముందుకు రాలేదన్నారు. ఐటీ రంగం అభివృద్ధికి బాబు చేసింది ఏమీలేదంటూ మంత్రి బుగ్గన గణాంకాల వివరాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్భాటంగా రూ. 1006 కోట్లు కేటాయించినా చివరగా కేవలం రూ. 464 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ప్రభుత్వం రూ. 454 కోట్లు కేటాయించిదని, అందులో చివరి పైసా వరకు ఖర్చు చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై బాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని మంత్రి బుగ్గన అన్నారు. ఐటీ పరిశ్రమకు రాయితీల కోసం గత ఐదేళ్లలో కేవలం రూ. 39 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని మంత్రి బుగ్గన అన్నారు. అలాంటి చంద్రబాబు ఇక్కడ నుంచే ప్రపంచానికి తాను టెక్నాలజీ నేర్పించానంటారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఏటా నిర్వహించే సమ్మిట్ల వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని అంటారు.. అయితే తమ ప్రభుత్వం కేవలం రూ. 45 కోట్లతో వలంటీర్లులుగా, గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులుగా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నదని అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఐదేళ్ల క్రితం నెలకు రెండు వేల మేర నిరుద్యోగ భృతి అన్నారు.. తీరా ఎన్నికల కోడ్ సమయంలో వెయ్యి రూపాయలు అందచేసి చేతులు దులుపుకున్నారన్నారు. టీడీపీ పాలనలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు. ఆ కంపెనీల పేర్లను చెప్పటానికి తానేమి భయపడటం లేదంటూ ‘న్యూనెట్, సాఫ్ట్‌సాల్వ్, సీఈఎస్, ప్లేకార్డ్’ కంపెనీలకు భూమి ఇచ్చి తిరిగి వారికే అద్దె రూపేణా రెట్టింపు చెల్లించడం ఇన్‌సైడ్ ట్రేడింగ్ కదా అని మంత్రి మేకపాటి ప్రశ్నించారు. అన్నింటికి మించి తన వారికి ఓ ధర, మిగిలిన వారికి మరో ధర నిర్ణయించటం వల్ల కూడా అనేక పరిశ్రమలు మూతబడటమో లేదా వెనక్కి వెళ్లటమో జరుగుతున్నదన్నారు.