బిజినెస్

‘ఎన్‌ఐఐఎఫ్’ ద్వారా తాజా రౌండ్‌లో బిలియన్ డాలర్ల సమీకరణ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 26: జాతీయ పెట్టుబడులు, వౌలిక వసతుల నిధి (ఎన్‌ఐఐఎఫ్) ద్వారా తాజా రౌండ్‌లో మరో బిలియన్ డాలర్లు అదనంగా సమీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నిధులను విదేశీ పెట్టుబడిదారుల నుంచి సమీకరించాలని నిర్ణయించినట్టు ఎన్‌ఐఐఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రకాష్ రావు శుక్రవారం నాడిక్కడ తెలిపారు. వౌలిక వసతులతోబాటు ఇతర కీలక రంగాలకు పెట్టుబడులు సమీకరించడంలో ఎన్‌ఐఐఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాగా కొంతమంది విదేశీ పెట్టుబడిదారుల నుంచి ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల సమీకరణకు సంబంధించి అంగీకారాన్ని పొందామని ప్రకాష్‌రావు తెలిపారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) నేతృత్వంలో ఇక్కడ ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాగా త్వరలో నిధుల వృద్ధికి సంబంధించిన సరికొత్త ఒప్పందాన్ని ఎన్‌ఐఐఎఫ్ ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఐతే ఇందుకు సంబంధించిన కాలవ్యవధి, నిధుల పరిమితి ఏదీ లేదని తెలిపారు. రెండు సార్వభౌమ ఆస్తుల నిధులకు చెందిన సంస్థల నుంచి ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కదుర్చుకోవడం జరిగిందని, ఇందులో అబుదాబీకి ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్ టెమాసెక్ ఉన్నాయని, వీరితోబాటు మరికొంతమంది భాగస్వాములను సైతం సమకూర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎన్‌ఐఐఎఫ్ మొత్తం మూడు దీర్ఘకాలిక నిధులను నిర్వహిస్తోందని ఇందులో సార్వభౌమ నిధులు, పింఛన్ నిదులు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 3 బిలియన్ డాలర్ల నిధుల లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే 250 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ జరిగిందని మిగిలిన 3 బిలియన్ డాలర్ల మేర విదేశీ వనరుల నుంచి సమీకరిచడం జరుగుతుందన్నారు. కాగా కీలక వౌలిక రంగాల కోసం 2.1 బిలియన్ డాలర్లతో మాస్టర్ ఫండ్, మరో 2 బిలియన్ డాలర్లతో రోడ్లకు సంబంధించి స్పానిష్ కంపెనీ ‘రోడిస్’తో కలిసి స్ట్రాటజిక్ కాంపౌండ్ నిధిని ఎన్‌ఐఐఎఫ్ నిర్వహిస్తోందన్నారు. 20 మిలియన్ డాలర్ల నిధిని పోర్టులు, లాజిస్టిక్స్ కోసం దుబాయ్ ఫోర్టు భాగస్వామ్యంతో మాస్టర్ ఫండ్‌గా నిర్వహిస్తున్నట్టు అయన తెలిపారు. అలాగే రైలు, మెట్రో రైలు ప్రాజెక్టులకు సైతం సైతం నిధులు సమీకరించాలన్న ఆలోచన ఉందన్నారు.