బిజినెస్

ఏడు శాతం లాభపడిన బజాజ్ ఫైనాన్స్ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: బజాజ్ ఫైనాన్స్ వాటాలు శుక్రవారం 7 శాతం అదనంగా లాభపడ్డాయి. ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో ఇదివరకెన్నడూ లేనంత అధిక స్థాయి నికర లాభాన్ని నమోదు చేయడమే ఇందుకు కారణం. జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి సంబంధించిన ఫలితాలు వెలువడిన వెంటనే వాటాలకు ఊపువచ్చింది. 7.20 శాతం లాభపడిన ఈ వాటాలు బీఎస్‌ఈలో ఒక్కోవాటా రూ. 3,266.65 వంతున ట్రేడయ్యాయి. ఒక దశలో ఈ వాటాలు 7.65 శాతం లాభాలతో ఒక్కో వాటా విలువ రూ. 3,279.65కు చేరింది. కాగా ఎన్‌ఎస్‌ఈలో సైతం ఈ కంపెనీ వాటాలు 7.40 లాభపడ్డాయి. ఒక్కోవాటా రూ. 3,272గా ట్రేడయ్యాయి. మొత్తం వాణిజ్య విలువను బట్టి 3.38 లక్షల వాటాలు బీఎస్‌ఈలోనూ, 69 లక్షల వాటాలు ఎన్‌ఎస్‌ఈలోనూ ట్రేడయ్యాయి. ఈ కంపెనీ గురువారం నాడు త్రైమాసిక ఫలితాలను వెలువరిచింది. అందులో నికర లాభాన్ని అత్యధికంగా 1,195 కోట్లుగా చూపింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ. 836 కోట్లతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. అలాగే కంపెనీ పూర్తి ఆదాయంలో సైతం 47 శాతం వృద్ధితో మొత్తం రూ. 5,808 కోట్ల సమకూరినట్టు తెలిపింది.