బిజినెస్

ఎట్టకేలకు లాభాల బాటలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 26: ఎట్టకేలకు వాణిజ్య వారం ముగింపురోజైన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట నుంచి బయటకు వచ్చాయి. సూచీలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. కొన్ని ఎంపిక చేసిన ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకుల స్టాక్స్ మంచి లాభాలను అందుకోవడంతో ఆరు రోజులపాటు వరుస నష్టాలతో సతమతమైన సూచీలు కోలుకున్నాయి. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 51.81 పాయింట్ల ఆధిక్యతతో 0.14 శాతం లాభాలతో 37,882.79 పాయింట్ల స్థాయిలో స్థిరపడింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 32.15 పాయింట్ల ఆధిక్యతతో 0.29 శాతం లాభపడి 11,284.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఓ వైపు కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించినంతగా లేకపోవడంతోబాటు, మరికొన్ని కంపెనీల ఫలితాలు వెలువడాల్సి ఉండగా, మరో మన దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్తున్నా, అంతర్జాతీయంగానూ పరిస్ధితులు ప్రతికూలంగా ఉన్నా మన మార్కెట్లు కోలుకోవడం గమనార్హం. వచ్చే రెండు వారాల్లో రుతుపవనాల ప్రభావంతో మంచి వర్షాలు కురుస్తాయని, వర్షపాతం కనీస స్ధాయిని మించుతుందని వచ్చిన అంచనాలు మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపిందని వాణిజ్య రంగ విశే్లషకులు చెబుతున్నారు. మొత్తం వారం రోజుల పరిస్థితులను పరికిస్తే సెనె్సక్స్ మొత్తం 454.22 పాయింట్లు కోల్పోయి 1.18 శాతం నష్టాల పాలవగా, నిఫ్టీ 134.95 పాయింట్లు నష్టపోయింది. ఇలావుండగా శుక్రవారం ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంక్ భారీగా 9.64 శాతం లాభపడింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ సైతం 7.20 శాతం లాభాలను సంతరించుకుంది. ఈ కంపెనీ తాజాత్రైమాసిక ఫలితాల్లో ఇదివరకెన్నడూ లేనంత అధిక స్థాయిలో రూ.1.195 కోట్ల నికర లాభాన్ని చూపడంతో స్టాక్ మార్కెట్లో వాటాల విలువ గణనీయంగా పెరిగింది. వీటితో బాటు హీరో మోటోకార్ప్, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్ సైతం 3.21 శాతం లాభాలను ఆర్జించాయి. గడచిన త్రైమాసికానికి నికర లాభంలో రూ. 31.67 కోట్ల తగ్గుదలను నమోదు చేసిన మారుతి సుజుకీ వాటాలు 0.78 శాతం నష్టపోయాయి. అలాగే వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ సైతం పెద్దమొత్తంలో 4.26 శాతం నష్టపోయాయి. ఇలావుండగా కనీస స్థాయికన్నా అధికంగా వర్షాలు పడతాయన్న అంచనాలతోబాటు భవిష్యత్తులో దేశ ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్న విశే్లషణలు విదేశీ సంస్ధాగత మదుపర్లను పునరాలోచించుకునేలా చేసిందని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో వాహన, బ్యాంకెక్స్, కేపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, పారిశ్రామిక, ఫైనాన్స్, వినిమయ వస్తువుల సూచీలు 1.98 శాతం లాభపడ్డాయి. ఐతే విద్యుత్, ఐటీ, టెక్, చమురు సహజవాయులు, 1.01 వాతం నష్టపోయాయి. ఇక బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.53 శాతం లాభాలను అందుకున్నాయి. కాగా విదేశీ సంస్ధాగత మదుపర్లు గురువారం నికరంగా రూ.126 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ. 398.53 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు.
నష్టాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా దేశాల్లో అధిక శాతం స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలను చవిచూశాయి. హ్యాంగ్‌సెంగ్, నిక్కీ, కోస్పి నష్టాల్లో ముగియగా, షాంఘై కాంపోజిట్ సూచీ మాత్రం లాభాలను నమోదు చేసింది. అలాగే ఐరోపా మార్కెట్లు కూడా ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను నమోదు చేశాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం 7 పెసలు పెరిగి ఇంట్రాడేలో మొత్తం 68.97 రూపాలుగా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.50 శాతం పెరిగి బ్యారెల్ 63.71 డాలర్ వంతున అమ్ముడైంది.