బిజినెస్

లాభాల్లో 50 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మిక, ఉద్యోగులకు బోనస్ ఇవ్వబోతున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ శ్రీ్ధర్ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవనంలో ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి బొగ్గు ఉత్పత్తితో పాటు అమ్మకాలు, రవాణాలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి కార్మికులు చేసిన కృషిని ఆయన కొనియాడారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, రవాణాలో దాదాపు రూ. 1766 కోట్ల రూపాయలు నికరలాభాలు సాధించామన్నారు. కార్మికులకు చెల్లించే లాభాల వాటాలపై త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామన్నారు. సీఎం ఆదేశాలతో కార్మికులకు రావాల్సిన బోనస్‌లను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి సంస్థకు అండగా ఉంటూ సమష్టి కృషితో సింగరేణిని ముందుకు తీసుకుపోవడంలో కార్మిక, ఉద్యోగుల పాత్రను ప్రశంసించారు. కొత్త గనులతో పాటు ఓబి పనులకు అనుమతులు విషయాలపై బోర్డ్ సమావేశంలో చర్చించారు. గత యేడాది కన్నా లాభాల్లో 50 శాతం వృద్ధి సాధించడం జరిగిందన్నారు. గత యేడాది రికార్డ్‌స్థాయిలో 644 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, 647 లక్షల టన్నుల బొగ్గు రవాణా సాధించి రూ. 25,828 కోట్ల రూపాయలు ఆర్జించామన్నారు. దీంతో రూ. 1766 కోట్ల రూపాయలు లాభాలు సాధించామన్నారు. బోర్డ్ సమావేశానికి సింగరేణి సంస్థ సీఎండీ అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ పీఎస్‌ఎల్ స్వామీ, డైరెక్టర్ ముఖేష్ చౌదరి, సింగరేణి సంస్థ డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్, భాస్కరరావు, బలరాం, కంపెనీ కార్యదర్శి శ్రీనివాసులు, సంస్థ సీపీఆర్‌వో మహేష్ పాల్గొన్నారు.