బిజినెస్

ధాన్యం అమ్మకానికి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూలై 27: జిల్లా వ్యాప్తంగా రబీ పంటకాలంలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలు మరో 15 రోజులపాటు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ధాన్యాన్ని రైతుల నుండి సేకరిస్తున్నట్లు తెలిపారు. 2018- 19 పంట కాలంలో ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 181 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. జూలై 26 నాటికి జిల్లా వ్యాప్తంగా 3,80,000 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,40,703.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 181 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులోని 164 కేంద్రాల ద్వారా 27,184 రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మరో పదిహేను రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూతబడనున్నాయన్నారు. ఇంకా రైతులు తమ వద్ద ధాన్యం ఉంటే అందరు రైతులు త్వరగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి, విక్రయించాలని ఆయన సూచించారు.