బిజినెస్

విద్యుత్ వాహనాలపై జీఎస్టీ ఇక 5 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: కాలుష్య రహిత విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ వాహనాలపై ఇప్పటివరకు ఉన్న 12 శాతం వస్తు, సేవా పన్ను (జీఎస్టీ)ని ఇకముందు 5 శాతంగా వసూలు చేయనుంది. విద్యుత్ వాహనాలపై తగ్గించిన పన్నుపై జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఇక్కడ జరిగిన 36వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ వాహనాలపై ఇప్పటివరకు 12 శాతం జీఎస్టీ విధిస్తుండగా, ఆగస్టు 1 నుంచి దానిని కేవలం 5 శాతం మాత్రమే వసూలు చేయనున్నారు. అదేవిధంగా విద్యుత్ చార్జర్లు, చార్జింగ్ స్టేషన్లలో విద్యుత్ వాహనాల కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న 18 శాతం జీఎస్టీని కూడా 5 శాతానికి తగ్గించారు. అదేవిధంగా విద్యుత్ అద్దె బస్సులకు (12 మంది కంటే ఎక్కువ మంది సామర్థ్యం) కూడా మినహాయింపు కూడా ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుందని జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, జీఎస్టీ సభ్యులు పాల్గొన్నారు. కాగా, జీఎస్టీ చట్టంలో మరికొన్ని మార్పులు చేయాలని కౌన్సిల్‌లో అభిప్రాయపడ్డారు. జీఎస్టీ సీఎంపీ-02 ఫారం కింద (సేవల సరఫరాదారులు) ట్యాక్స్ చెల్లింపు గడువును ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 30వరకు పొడిగించినట్టు జీఎస్టీ కౌన్సిల్ తన ప్రకటనలో తెలిపింది.

చిత్రం...ఢిల్లీలో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,
రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ తదితరులు