బిజినెస్

ఈ-కామర్స్‌లో 100 శాతం ఎఫ్‌డిఐకి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: ఆన్‌లైన్ మార్కెట్ సంస్థల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డిఐపిపి) మార్గదర్శకాల ప్రకారం ఈ-కామర్స్ రిటైలర్లలో 100 శాతం ఎఫ్‌డిఐకి కేంద్రం అనుమతించింది. దేశంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోగా, ప్రస్తుతం దేశీయంగా అమెజాన్, ఈబే వంటి అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలు, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి భారతీయ సంస్థలున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయానికి ఈ-కామర్స్ సంస్థలు మద్దతిస్తుండగా, వాణిజ్య సంఘాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయ.

దేశీయ ఎగుమతుల్లో ఏపికి ఐదో స్థానం
ముంబయి, మార్చి 29: గత ఆర్థిక సంవత్సరం (2014-15) దేశం నుంచి విదేశాలకు జరిగిన వాణిజ్య, వ్యాపార ఎగుమతుల్లో కేవలం మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి జరిగినవే 46 శాతానికిపైగా ఉన్నాయి. అసోచామ్ తెలిపిన వివరాల ప్రకారం ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడి నుంచే 69 శాతానికిపైగా ఎగుమతులయ్యాయి. 2014-15 ఎగుమతుల విలువ దాదాపు 310 బిలియన్ డాలర్లుగా ఉంది.్వత సెబీ అధీనంలోకి 87 సహారా ఆస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిని మార్కెట్ ధరలో 90 శాతానికి తగ్గకుండా విక్రయించాలని సెబీకి చీఫ్ జస్టీస్ టిఎస్ థాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ 90 శాతం దిగువకు అమ్మాల్సి వస్తే కోర్టును సంప్రదించాలని చెప్పింది. సుబ్రతా రాయ్ బెయిల్‌కు 5,000 కోట్ల రూపాయల నగదు, మరో 5,000 కోట్ల రూపాయల బ్యాంక్ పూచీకత్తును డిపాజిట్ చేయాలని సుప్రీం గతంలో సూచించినది తెలిసిందే. అయితే దేశ, విదేశాల్లో ఇందుకు ప్రయత్నించి విఫలమైంది సహారా. ఈ నేపథ్యంలో తాజా సూచన సుప్రీం నుంచి వచ్చింది.