బిజినెస్

కొనుగోళ్ల ఉత్సాహంలో విదేశీ మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: విదేశీ మదుపరులు ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 8,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. దేశ, విదేశీ అనుకూల సంకేతాలు, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం వంటివి భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులను భారీగా రప్పిస్తున్నాయ. 2009 నుంచి గమనిస్తే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తొలిసారిగా కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించడం కూడా కలిసొచ్చింది. దీంతో ఆగస్టు 1-26 మధ్య స్టాక్ మార్కెట్లలోకి 8,127 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్ల నుంచి 2,,727 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపో యాయ. ఫలితంగా భారతీయ మార్కెట్లలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ 5,400 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, గత నెల జూలైలో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు గడచిన నాలుగు నెలల్లో అత్యధికంగా నిలిచాయ. 12,612 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయ. మార్చి నెలలో 21,143 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, మళ్లీ జూలైలోనే ఎక్కువగా రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ నెలలోనూ భారీగానే విదేశీ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయ. అయతే రుణ మార్కెట్లలోకి గత నెల 6,845 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. ఈ నెల మాత్రం రుణ మార్కెట్లపై ఆసక్తిని కనబరచడం లేదు. కాగా, ఈ ఏడాది జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 39,905 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. రుణ మార్కెట్ల నుంచి 7,450 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 32,455 కోట్ల రూపాయలుగా నమోదైంది.