బిజినెస్

ద్రవ్య లభ్యతకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యలను త్వరలో పరిష్కరించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సంస్థలు, ఇళ్ల కొనుగోలుదారులు ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ద్రవ్యలభ్యత కొరత, డిమాండ్ మందగించడం, ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి సమస్యలను వివరించారు. నిర్మలా సీతారామన్ ఆదివారం రెండుసార్లు వివిధ సంస్థలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆమె తొలుత రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సంస్థలు సీఆర్‌ఈడీఏఐ (క్రెడాయి), ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ (నరెడ్కో)తో సమావేశమయ్యారు. తరువాత ఇళ్ల కొనుగోలుదారుల అసోసియేషన్‌తో సమావేశమయ్యారు. ఈ రెండు సమావేశాలలోనూ ఆమె స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, హౌసింగ్, సీబీడీటీ, కార్పొరేట్ వ్యవహారాలు, రెరా శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు నిర్మలా సీతారామన్‌తో పాటు ఈ సమావేశాలలో పాల్గొన్నారు. ద్రవ్యలభ్యత కొరత, అంతగా విక్రయాలు లేకపోవడం వల్ల స్థిరాస్తి రంగంలో అశాంతి నెలకొందని క్రెడాయి, నరెడ్కోలకు చెందిన ప్రతినిధులు నిర్మలా సీతారామన్‌కు వివరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్థిరాస్తి రంగ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు)ను ప్రోత్సహించాలని వారు ఆర్థిక మంత్రిని కోరారు. ఈ సమావేశానంతరం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి మీడియాతో మాట్లాడుతూ స్థిరాస్తి రంగానికి చెందిన సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఎంతో ఉపయోగకరమయిన చర్చ జరిగిందని తెలిపారు. ఈ రంగానికి సంబంధించిన అనేక సమస్యలను తాము ఈ చర్చల్లో గుర్తించామని, రానున్న రోజుల్లో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు.