బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 13: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల పాలయ్యాయి. ప్రధానంగా హెవీ వెయిట్స్ సూచీ, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీ బ్యాంక్ వాటాలు పెద్దయెత్తున అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న వాటాల విక్రయ వెల్లువ సైతం దీనికి తోడైంది. దాదాపుగా మొత్తం దేశీయ మార్కెట్లపై ఈ ప్రభావం పడింది. కాగా ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) వాటాలు మాత్రం సుమారు 10 శాతం లాభపడి మొత్తం మార్కెట్లు మరింత భారీ నష్టాలపాలు కాకుండా నియంత్రించాయి. మనదేశంలో దాదాపుగా అన్ని రంగాల్లో వినియోగదారుల డిమాండ్ తగ్గడంతోబాటు, దేశ ఆర్థికాభివృద్ధి మందగమనం, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు సైతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మదుపర్లు వాటాల విక్రయం వైపే మక్కువ చూపారు. తొలుత సుమారు 700 పాయింట్లు కోల్పోయిన బీఎస్‌ఈ 30 షేర్ల సెనె్సక్స్ చివరి గంటల వ్యవధిలో స్వల్పంగా కోలుకుంది. చివరికి 623.75 పాయింట్లు లేదా 1.66 శాతం నష్టాలతో 36,958.16 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 36,888.49 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 37,755.16 పాయింట్ల గరిష్టాన్ని స్పృశించింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 183.80 పాయింట్లు కోల్పోయి 1.65 శాతం నష్టాలతో 10,925.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ ఇంట్రాడేలో 10,901,60 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 11,145,90 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన ఈ ట్రేడింగ్‌లో సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి, టాటాస్టీల్, ఎల్ అండ్ టీ అత్యధికంగా 10.35 శాతం నష్టపోయాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 9.72 శాతం లాభాలను సంతరించుకుని మంగళవారం నాటి అత్యధిక లాభదాయక కంపెనీగా నిలిచింది. సంస్థకు చెందిన చమురు, రసాయనాల వాణిజ్య విభాగం వాటాలను సౌదీకి చెందిన దిగ్గజ చమురు సంస్థ ‘ఆర్మాకో’కు, అలాగే ఇంధన రీటెయిల్ వ్యవస్థను బీపీ పీఎల్‌సీకి విక్రయించి తద్వారా 1.15 లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలన్న లక్ష్యాన్ని ఆ కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించడంతో కంపెనీకి లాభాల పంట పండింది. అలాగే టెలికాం విభాగం జియో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను వచ్చే నెల నుంచి చేపట్టనున్నట్టు ప్రకటించడం సైతం కంపెనీ వాటాలకు సానుకూలంగా మారిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఇలావుండగా సన్‌పార్మా, పవర్‌గ్రిడ్ వాటాలు సైతం మంగళవారం లాభాలను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో మొత్తం మార్కెట్ల భారీ నష్ట నివారణ జరిగింది. కాగా గడచిన జూలైలో వాహన రంగంలో విక్రయాలు 19 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవడం దాదాపు 18.71 శాతం నష్టాలను కూడగట్టుకోవడం జరిగింది. గడచిన మూడు నెలల కాలంలో ఈ రంగంలో సుమారు 15 వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతోబాటు అర్జెంటీనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లలో భారీగా నెలకొన్న వాటాల విక్రయాల వత్తిడి వంటి పలు అంతర్జాతీయ ప్రతికూలతలు వాహన రంగాన్ని అతలాకుతలం చేశాయని ప్రముఖ విశే్లషకుడు జగన్నాథం తునుగుంట పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లదీ అదేతీరు
హాంగ్‌కాంగ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల తీవ్రత పెరగడం సైతం దేశ, అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేసిందని అంటున్నారు. ఈక్రమంలో హాంగ్‌కాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ మంగళవారం 2.10 శాతం నష్టపోయింది. ఇక షాంఘై కాంపోజిట్ సూచీ సైతం 0.63 శాతం నష్టాలను సంతరించుకుంది. కోస్పి 0.85 శాతం, నిక్కీ 1.11 శాతం వంతున నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు సైతం అదేబాటలో ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను చవిచూశాయి.
తగ్గిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం 49 పైసలు తగ్గి ఇంట్రాడేలో రూ. 71.27లుగా ట్రేడైంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.51 శాతం పెరిగాయి. బ్యారెల్ 58.27 శాతం వంతున ట్రేడైంది.