బిజినెస్

అనుమతిలేని ఫ్లాట్స్ కొనకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో లేఅవుట్లు, భవనాల నిర్మాణాలకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ (రేరా) మొదటిసారిగా మూడు భవనాల విషయంలో అధికారికంగా ప్రకటన చేసింది. కూకట్‌పల్లి విలేజ్‌లోని సర్వేనెంబర్ 477 లోని 13, 14, 15 ప్లాట్లలో భవనాలను బి. ప్రతాప్‌రెడ్డి మరియు ఇతరులు కలిసి నిర్మించారని, వీటికి రేరా అనుమతి లేదని ఈ సంస్థ కార్యదర్శి బుధవారం ప్రకటించారు. అలాగే కొండాపూర్ విలేజ్‌లోని సర్వేనెంబర్ 56 లో కే. బసవ శంకర్‌రావు నిర్మించిన అపార్ట్‌మెంట్‌కు, గోపాల్‌రావు నగర్‌లోని 148 నుండి 155 సర్వేనెంబర్లలో 595, 596 ప్లాట్లలో నిర్మించిన భవనాలకు అనుమతి లేదని తెలిపారు. ఈ భవనాలను ఎవరూ కొనవద్దని రేరా హెచ్చరించింది.