బిజినెస్

వాహన రంగ ఉనికికి ప్రమాదకరంగా వాణిజ్య మాంద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: టీవీఎస్ గ్రూప్‌లో అంతర్భాగమైన వాహన పరికరాల తయారీ సంస్థ ‘సుందరం క్లైటాన్ లిమిటెడ్’ (ఎస్‌సీఎల్) తమిళనాడు పాడిలోని తన కర్మాగారంలో ఉత్పత్తిని రెండు రోజులపాటు నిలిపేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. వాహన రంగంలో తలెత్తిన మాంద్యం నేపథ్యంలో ద్విచక్ర వాహనాల సంస్ధ హీరో మోటోకార్ప్ బాటలోనే తమ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని ఎస్‌సీఎల్ వెల్లడించింది. హీరోమోటోకార్ప్ ఇప్పటికే నాలుగు రోజులపాటు ఉత్పత్తిని ఆపివేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. కాగా 16,17 (శుక్ర, శనివారాలు) తమ సంస్థ పాడి ఫ్యాక్టరీకి ‘నాన్ వర్కింగ్ డేస్’గా ప్రకటించినట్టు ఎస్‌సీఎల్ తెలిపింది. ప్రభుత్వం వెంటనే వాహన రంగ వాణిజ్య మాంద్య సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. పలు వాహన, పరికరాల తయారీ సంస్థలు ప్రస్తుతం ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన, తాత్కాలిక మూసివేయాల్సిన దుస్థితిలో ఉన్నాయని తెలిపింది. కాగా ఈనెల 15 నుంచి 18 వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఇప్పటికే దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ ప్రకటించడం జరిగింది. ఈ నెల ఆరంభంలో మరో వాహన పరికరాల తయా రీ సంస్థ ‘బోస్చ్ లిమిటెడ్’ తమ సంస్థకు చెందిన తమిళనాడులోని గంగైకొండన్ ప్లాంటును, మహారాష్టల్రోని నాశిక్‌లోని ప్లాంట్‌ను 13 రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించాయ.