బిజినెస్

టీటీడీకి సరఫరా చేసే బియ్యం ధర తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 17: టీటీడీకి రానున్న మూడు నెలల కాలానికి సరఫరా చేసే బియ్యానికి కిలోకు ఒక్క రూపాయి చొప్పున తగ్గించి రూ. 37కే అందించేందుకు అఖిల భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అంగీకరించిందని తిరుమల ప్రత్యేకాధికారి ఎ.వి.్ధర్మారెడ్డి చెప్పారు. శనివారం ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో అఖిల భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఏపీ రైస్ మిల్లర్స్, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఎ.వి.ధర్మారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి రోజూ లక్షా 60వేల మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కిలో బియ్యం రూ. 38గా ఉండగా దానిపై ఒక్క రూపాయి తగ్గించి సరఫరా చేస్తారన్నారు. ప్రస్తుతం అసోయేషన్ ప్రతినిధులు 375 క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా అఖిల భారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్ గుమ్మడి వేంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దఎత్తున అన్నదానం చేస్తున్న టీటీడీకి నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామనీ, అన్ని జిల్లాల అసోసియేషన్లతో చర్చించి టీటీడీకి బియ్యం విరాళాలను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హనుమంత రావు, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర రావు, మార్కెటింగ్ జీఎం జగదీశ్వర్ రెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి ఎస్.వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్ శాస్ర్తీ పాల్గొన్నారు.