బిజినెస్

ఐఒసి లాభం రూ. 8,269 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే భారీగా పెరిగింది. ఈసారి 8,268.98 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 6,590.83 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో నిరుడుతో సరిచూస్తే ఈసారి 25 శాతం లాభాలు పెరిగినట్లైంది. ఈ మేరకు రెగ్యులేటరీకి ఐఒసి సోమవారం తెలియజేసింది. కాగా, 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లనూ ఈ సందర్భంగా సంస్థ ప్రకటించింది. 10 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్‌కు మరోక 10 రూపాయల విలువ కలిగిన ఈక్విటీ షేర్‌ను బోనస్‌గా కేటాయించేందుకు ఐఒసి బోర్డు అంగీకరించింది. ఇకపోతే ఆదాయం విషయానికొస్తే ఈ త్రైమాసికంలో 1,14,200.24 కోట్ల రూపాయలుగా, గత త్రైమాసికంలో 1,07,670.95 కోట్ల రూపాయలుగా ఉంది.