బిజినెస్

కేటీపీపీని వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/గణపురం: కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) మొదటి దశను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో సుమారు పది సార్లు వివిధ కారణాలతో ప్లాంటు నిలిచిపోయింది. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో తగ్గడంతో శుక్రవారం కేటీపీపీ అధికారులు ప్లాంటును అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. తరిగి శనివారం సాయంత్రం మళ్లీ 500 మెగావాట్ల ప్లాంటులో లైట్ ఆఫ్ ప్రారంభించారు. ఆదివారం ఉదయానికి పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలావుండగా వరుస సాంకేతిక సమస్యలు ప్లాంటును చుట్టు ముడుతుండడంతో జెన్‌కో ఉన్నతాధికారులు త్వరలో కేటీపీపీ మొదటి దశకు ఓవరాలింగ్ పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గడం, భారీ వర్షాలతో జల విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి స్థాయి ఉత్పత్తి చేస్తుండడంతో థర్మల్ విద్యుత్ ప్లాంటులకు పూర్తి స్థాయి మరమ్మతులు చేసే యోచనలో జెన్‌కో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. గత వారం మొదటి దశలోని డీఏవీఆర్‌లో ఎలక్ట్రిక్ విభాగంలో తలెత్తిని సాంకేతిక సమస్య స్థానిక ఇంజనీర్లతో మరమ్మతు పనులు పూర్తి కాకపోవడంతో బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్లను రప్పించి జెన్‌కో డైరెక్టర్ ప్రాజెక్టు సశ్చిదానందం మరమ్మతు పనులను తానే స్వయంగా పరిశీలించారు. వరుస సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న మొదటి దశను త్వరలో ఓవరాలింగ్‌కు తీసుకెళ్లాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.