బిజినెస్

‘పీసీఏ’ నుంచి త్వరలో యూకో బ్యాంక్‌కు విముక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 18: రిజర్వు బ్యాంకు ‘ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్’ (పీసీఏ) నుంచి తమ బ్యాంకు వచ్చే ఏడాదిలోగా బయటపడే అవకాశాలున్నాయని యూకో బ్యాంక్ ఎండీ, సీఈవో అతుల్ కుమార్ గోయెల్ ఆదివారం నాడిక్కడ ధీమా వ్యక్తం చేశారు. అన్ని శాఖా కార్యాలయాల ఉన్నతాధికాలతో జరిగిన సమావేశానంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. 2020 చివరి త్రైమాసికానికల్లా తమ బ్యాంకు లాభాల్లోకి వస్తుందని ఆయన అన్నారు. బ్యాంకుకు సంబంధించిన నాలుగు కీలక రెగులేటరీ ట్రిగ్గర్ పాయింట్లలో ఏదైనా ఒకదాని నిర్వహణలో వైఫల్యం తలెత్తినప్పుడు ఆర్బీఐ తన పీసీఐ మార్గదర్శకాల పరిధిలోకి తీసుకోడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రధానంగా క్లిష్టతర ఆస్తుల్లో మూలధన పెట్టుబడులు, స్థూల నిరర్థక ఆస్తులు, ఆస్తులపై వచ్చే ఆదాయాలు, లేదా లాభాలు, లీవరేజ్ (పరపతి) నిష్పత్తి అంశాలను ఆర్బీఐ ప్రధానంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని గోయెల్ తెలిపారు. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా మళ్లీ తమ బ్యాంకు 2020 మార్చి నాటికి పూర్తి స్థాయి వృద్ధిని సంతరించుకుంటుందని ఆయన చెప్పారు. గడచిన జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి తమ బ్యాంకు రూ. 1,201 కోట్ల నిర్వహణ (ఆపరేటింగ్) లాభాలను నమోదు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. గత 14 త్రైమాసికాల్లో తమ బ్యాంకుకు ఇదే అత్యధిక లాభదాయక ఫలితమని ఆయన చెప్పారు. కేవలం నిరర్థక ఆస్తుల కారణంగానే నష్టాలు తలెత్తాయని, ఆ ఆస్తుల శాతాన్ని తగ్గించుకునేందుకు నిర్థిష్టమైన విజన్‌తో ముందుకెళుతున్నామన్నారు. 2019 మార్చి నెలకు ముందు తమ బ్యాంకు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) రూ. 29,786 కోట్లని ఆయన వెల్లడించారు. తదుపరి మార్చినాటికి ఆ ఆస్తులను రూ. 29,432 కోట్లకు తగ్గించడం జరిగిందని, అలాగే 2019 మార్చిలో స్థూల నిరర్ధక ఆస్తులు విలువ రూ. 9,650 కోట్లుకాగా, అది గత జూన్ త్రైమాసికానికి రూ. 8,782 కోట్లకు దిగివచ్చిందని గోయెల్ వివరించారు. ప్రస్తుతం జాతీయ కంపెనీ న్యాయ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి నివేదించిన కేసులు కాకుండా ప్రతి త్రైమాసికానికి కనీసం రూ. 2,000 కోట్లు, లేదా ఏడాదికి రూ. 8,000 కోట్ల వంతున నిరర్థక ఆస్తులను తగ్గించుకోవాలని, మొండి బకాయిలు వసూలు చేయాలని తమ బ్యాంకు లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. వచ్చే త్రైమాసికంలోగా రూ. 1,500 కోట్ల మొండి బకాయిలను వసూలు చేస్తామన్న ఆత్మవిశ్వాసం తమకుందన్నారు. ప్రధానంగా మూడులేదా నాలుగు అతిపెద్ద ఖాతాలపై దృష్టి నిలుపుతున్నామన్నారు. ఈక్రమంలోనే యూకో బ్యాంకు సీఎండీ గోయెల్ ఆదివారం ఇక్కడ సమావేశం నిర్వహించారు.