బిజినెస్

చమురు, సహజ వాయుల ఉత్పత్తి ద్విగుణీకృతానికి ఓఎన్‌జీసీ ప్రత్యేక వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: చమురు సహజ వాయుల కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ద్వారా 2040 నాటికి ఉత్పత్తులు దిగుణీకృతం చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆ సంస్థ చైర్మన్ శశిశంకర్ ఆదివారం నాడిక్కడ తెలిపారు.
దేశీయంగానూ, విదేశాల్లోనూ ఉన్న సంస్థకు చెందిన క్షేత్రాల రీఫైనింగ్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో కూడిన కొత్త ‘విజన్ డాక్యుమెంట్ 2040’ని రూపొందించడం జరిగిందన్నారు.
ఈ సరికొత్త ఇంధన వ్యూహం ద్వారా తమ కంపెనీ ప్రపంచంలో ఓ ప్రత్యేక ఇంధన కంపెనీగా రూపాంతరం చెందుతుందని, ‘ఈ అండ్ పీ’ వాణిజ్యం, ‘త్రీ ఎక్స్’ ఆదాయాలను వృద్ధి చేసుకోవడంతోబాటు 5నుంచి 6 రెట్లు అదనంగా మార్కెట్ విలువను సంతరించుకోవడం జరుగుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
2018-19లో తమ సంస్థ మొత్తం 24.23 మిలియన్ టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేసిందని, అలాగే 25.81 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువులను దేశీయ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేయడం జరిగిందని ఆయన వివరించారు. అలాగే మరో 10.1 మిలియన్ టన్నుల చమురు, 4,736 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను విదేశీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేశామన్నారు. గడచిన మార్చి నాటికి రూ. 1,09,654 కోట్ల టర్నోవర్‌ను, రూ. 26,715 కోట్ల నికర లాభాన్ని ఓఎన్‌జీసీ ఆర్జించిందని శశిశంకర్ వివరించారు. ఈనెల 16 నాటికి సంస్థ మార్కెట్ విలువ రూ. 1,64,454 కోట్లకు చేరిందని తెలిపారు.
కాగా ఇటీవల జరిగిన ఓఎన్‌జీసీ బోర్డు సమావేశం ప్రత్యేక వాణిజ్య రోడ్ మ్యాప్‌నకు ఆమోదం తెలిపిందని, కంపెనీతోబాటు అనుబంధ సంస్థలకు వర్తించేలా ప్రత్యేక వ్యూహం 2014 రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈమేరకు ఎక్స్‌ప్లొరేషన్, ఉత్పత్తి, రీఫైనింగ్, మార్కెటింగ్ విభాలతోబాటు ఇతర వాణిజ్య వ్యవహారాలకు సంబంధించిన ఆదాయాన్ని మూడు రెట్లు పెంచాలని, పన్నుల తర్వాత వచ్చే లాభాలు (పీఏటీ)ని నాలుగు రెట్లకు పెంచాలని, ఇందులో నాన్ ఆయిల్ అండ్ గ్యాస్ వాణిజ్య భాగస్వామ్య 10 శాతం ఉండేలా చూడాలని, కనీసం 6 శాతం అదనంగా మార్కెట్ విలువ పెరగాలని లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. కీలక ప్రాధాన్యతా వాణిజ్యాన్ని విస్తరించుకోవడం, కొత్త వెంచర్ నిధుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయ ఇంధన తయారీని చేపట్టడం కూడా జరుగుతాయన్నారు.
కంపెనీ అనుబంధ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఎంఆర్‌పీఎల్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న 35 మిలియన్ టన్నుల వార్షిక చమురు రీఫైనింగ్ సామర్ధ్యాన్ని 90 నుంచి 100 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చైర్మన్ శశిశంకర్ వెల్లడించారు. అలాగే ప్రాధాన్యతా ప్రాతిపదికన పెట్రోకెమికల్ ఉత్పత్తి క్షేత్రాలను సైతం విస్తరించేందుకు నిర్ణయం జరిగిందన్నారు.