బిజినెస్

స్థిరాస్తి రంగ అభివృద్ధితో దేశ ఆర్థికాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: వినియోగదారులకు నాణ్యతతో కూడిన గృహ సముదాయాలను నిర్దేశిత సమయానికే నిర్మించి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా స్ధిరాస్తి వ్యాపారులకు సూచించారు. స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందితే దేశ ఆర్ధికాభివృద్ధి వేగవంతానికి, ఉద్యోగాల కల్పనకు అవకాశాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. దేశ వ్యాప్త స్థిరాస్తి రంగ వ్యాపారుల సంఘం ‘నారెడ్కో’ నేతృత్వంలో సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఓమ్‌బిర్లా పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా స్థిరాస్తి రంగం ప్రత్యేక ఇమేజ్‌ను సంతరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ‘2022 నాటికి అందరికీ ఇళ్లు’ అన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రైవేటు వ్యాపారుల భాగస్వామ్యమూ అవసరమని ఆయన అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో స్థిరాస్తి రంగం కూడా కీలక భూమిక పోషిస్తుందన్నారు. ప్రధానంగా నిర్మాణ రంగంలో సాంకేతిక, సాంకేతికేతర ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వచ్చే నిరుపేదలకు ఈ రంగం తక్షణ ఉపాధిని కల్పిస్తోందని ఓమ్‌బిర్లా పేర్కొన్నారు. సిమెంటు, ఇనుము, ప్లంబింగ్ తరితరాలు సైతం ఈ రంగంతో ముడిపడి ఉండటం వల్ల ఈ అనుబంధ రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పార్లమెంట్‌లో సైతం స్థిరాస్తి రంగం అభివృద్ధి ప్రణాళికలపై విస్తృత స్థాయి చర్చలు జరగాలని ఆయన సూచించారు. తొలుత ఈ రంగంపై ఉన్న అపోహలను తొలగించాలని, ఇందుకోసం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ రంగం అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చట్టాలు తీసుకువచ్చినా అవి సత్వరం సభ ఆమోదం పొందేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కాగా సభలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ స్థిరాస్తి రంగంలో అధిక వృద్ధి రేటును సాధించేందుకు అనుగుణంగా వ్యాపారులు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. అందరికీ ఇళ్లు అన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు చేయూతనివ్వాలని సూచించారు. ‘నారేడ్కో’ చైర్మన్ రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవుపెట్టారు. అలాగే ఈ రంగంలో ద్రవ్యలోటు సమస్య ప్రధానంగా ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన్ హిరానందాని తెలిపారు.