బిజినెస్

పరిశోధనలు ఇక్కడ.. ఉత్పత్తులు అక్కడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 29: మెట్ట పంటల సాగుకు పెట్టింది పేరైన తెలంగాణ భూముల్లో మేలైన ఆధునిక వంగడాలను పండించడానికి అవకాశం కల్పిస్తూ కొత్త పరిశోధనల కోసం నెలకొల్పిన ఇక్రిశాట్ సేవలు అన్నదాతలకు అంతంత మాత్రంగానే అందుతున్నాయ. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సందర్భాల్లో వ్యవసాయ పంటల సాగును ప్రస్తావిస్తూ ఇక్రిశాట్‌ను గుర్తు చేసుకున్నారు. పాలకులకు గుర్తున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం ఇక్రిశాట్‌ను సందర్శించడం మరిచిపోయారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపూర్ మండలాల పరిధిలో 1972 సంవత్సరంలో 1,600 హెక్టార్ల (3600 ఎకరాల) సువీశాలమైన విస్తీర్ణంలో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రాన్ని (ఇక్రిశాట్) ప్రారంభించారు. ఇక్కడ వ్యవసాయ శాస్తవ్రేత్తలు, అధికారులు, కార్మికులతో కలుపుకుని సుమారు రెండు వేల మందికిపైగానే ప్రతి రోజు పని చేస్తున్నారు. అమెరికా, ఆఫ్రికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, కొలంబియా, శ్రీలంక, థాయిలాండ్, ఫిలిపిన్స్ లాంటి అనేక దేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు తరుచుగా సందర్శించి వారి అనుభవాలను తెలియజేయడంతోపాటు ఇక్కడి పరిశోధనలపై అధ్యయనం చేయడం పరిపాటి. ఈ క్రమంలో బూజుపట్టిన వ్యవసాయ విధానాలకు స్వస్తి పలుకుతూ కొత్త ఒరవడిని ఇక్రిశాట్ అనేక పరిశోధనల ద్వారా బయటకు తీసుకువచ్చింది. తెలంగాణలోని నల్లరేగడి, ఎర్రనేలలు, చౌడు భూములలో ఇక్కడి వాతావరణం, భూసారానికి అనుగుణంగా ఆధునిక వంగడాలను కనుగొని రైతులకు లాభించేలా ఎన్నో పరిశోధనలు చేసి మంచి ఫలితాలను ఇచ్చింది. తెలంగాణలో సాగునీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఆరుతడి పంటలను అధికంగా పండిస్తారు. మొక్కజొన్న, తెల్లజొన్న, పచ్చజొన్న, సజ్జలు, రాగులు, కొర్రలు, ఆముదం, నువ్వులు, అవుశలు, తెల్లకుసుమ, పొద్దుతిరుగుడు, పెసలు, మినుము, కంది, శనగ, వేరుశనగ, బటాని, ఎర్రబటాని తదితర ఆహార పంటలతో పాటుగా కూరగాయల సాగును కూడా అధికంగానే సాగు చేస్తుంటారు. వీటన్నిటిపై పరిశోధనలను ఇక్రిశాట్ విజయవం తంగా నిర్వహించింది. వరి పైరుపై కూడా అనేక పరిశోధనలు కొనసాగించింది. అంతేగాక మిరప, బెండ, బీర, దోస, పెద్దచిక్కుడు, గోరుచిక్కుడు, గోబి, క్యాలీప్లవర్, బీర్నిస్, బంగాళ దుంప, అల్లం, ఉల్లిగడ్డ తదితర పంటలను తెలంగాణలోని అనేక జిల్లాల్లో సాగు చేస్తున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరువలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని వర్గల్, ములుగు, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూరగాయల సాగును రైతులు ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు. ఇక్రిశాట్ పరిశోధనల ద్వారా గ్రీన్‌హౌస్, పాలీహౌస్‌లు వ్యవసాయ రంగంలో ప్రవేశించాయని చెప్పవచ్చు. అయతే ఇదంతా ఇక్రిశాట్ గత చరిత్రే అయ్యంది. దేశాభివృద్ధికి వ్యవసాయం వెనె్నముక అని పాలకులు చెప్పుకుంటున్నా.. అలాంటి వెనె్నముకకు కావాల్సిన అధునాతన అవసరాలను సమకూర్చడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యం చేయగా, సిఎం కెసిఆర్ ఇక్రిశాట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించినా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్రం ఇప్పుడు స్పందించడం లేదుమరి. అయతే పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకుగాను ఆ రాష్ట్రంలో భూ చేతన, భూ సంవృద్ది, గోల్డెన్ విలేజ్ పేరుతో కొత్త కార్యక్రమాలకు తెరలేపింది. కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ తన శాఖను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ రాష్ట్రంలో చేపట్టిన మూడు పథకాలను ఇక్రిశాట్ పరిశోధనల ద్వారా వృద్ధి చేయిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సదస్సుకు హాజరైన కర్నాటక మంత్రి సదస్సు ముగిసే వరకు అక్కడే ఉండి శాస్తవ్రేత్తలు సూచనలు, సలహాలు స్వీకరించడం గమనార్హం. కర్నాటకలోని భూములను పరిశీలించి అందుకు అనుగుణంగా సరికొత్త పరిశోధనల ద్వారా లాభదాయకమైన వంగడాలను అందించాలని కోరడం వ్యవసాయ శాఖ అభివృద్ధిపై ఆ రాష్ట్రానికి ఉన్న చిత్తశుద్దికి అద్ద పడుతోంది. కానీ తెలంగాణ వ్యవసాయ శాఖకు మాత్రం ఇక్రిశాట్‌పై పక్క రాష్ట్రానికి ఉన్న శ్రద్ధ కూడా లేకుండా పోతోంది. గొప్ప గొప్ప శాస్తవ్రేత్తలు స్వయంగా వచ్చి తగిన సూచనలు ఇస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మేలు రకమైన విత్తనాల ఉత్పత్తి చేయిస్తున్నా.. తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం బూజుపట్టిన విధానాలతోనే వ్యవసాయ రంగాన్ని నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కొత్త రకం వ్యవసాయానికి అవసరమైన సూచనలను, సలహాలను స్వీకరించి, మేలురకమైన విత్తనాలను రైతులకు అందించాలని కోరుకుందాం.

చిత్రాలు.. పటాన్‌చెరు మండలంలో స్థాపించిన ఇక్రిశాట్
ఆధునిక జొన్న వంగడాన్ని పరిశీలిస్తున్న విదేశీ శాస్తవ్రేత్త