బిజినెస్

స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 19: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెషన్ ఆరంభంలో లాభాల బాట పట్టిన సూచీలు చివరి గంటల్లో ఫైనాన్షియల్, వాహన రంగ స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల వత్తిడితో స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం వివిధ రంగాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపట్టవచ్చన్న అంచనాల నడుమ మదుపర్లు ఆచితూచి అడుగేశారు. మరోవైపునాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆర్థిక అస్థిరత సైతం మార్కెట్లను ఒడిదుడుకులకు గురిచేశాయని, తద్వారా వాటాల విక్రయాల వత్తిడి మరింతగా పెరిగిందని విశే్లషకులు పేర్కొంటున్నారు. ముందుగా ఊహించినట్లే అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో లాభాలతోనే ఆరంభమైన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 369 పాయింట్లు ఎగబాకింది. ఐతే చివరి గంటల్లో నెలకొన్న అమ్మకాల వత్తిడితో వేగంగా కిందికి దిగివచ్చింది. చివరికి 52.16 పాయింట్ల స్వల్ప ఆధిక్యతతో 0.14 శాతం లాభాలతో 37,402.49 పాయింట్ల ఎగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈసూచీ ఒక దశలో 37,718 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 37,358.49 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం కేవలం 6.10 పాయింట్ల ఆధిక్యతకు పరిమతమై 0.06 శాతం లాభాలతో 11,053.90 పాయింట్ల వద్ద స్థిరపడింది, ఈ సూచీ సైతం ఇంట్రాడేలో ఓ దశలో 11,146.90 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 11,037.85 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో సన్‌పార్మా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 2.66 శాతం అదనంగా లాభపడ్డాయి. మరోవైపు యెస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, టాటాస్టీల్, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా 3.46 శాతం నష్టపోయాయి. ముఖ్యమైన షాడో బ్యాంకుల ఆస్తుల నిర్థిష్ట నాణ్యతను అంచనా వేసేందుకు ఆదేశాలు జారీచేయడానికి రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నిరాకరించడంతో బ్యాంకింగ్ స్టాక్‌లపై ప్రతికూల ప్రభావం పడిందని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా తొలుత ఆసియన్ మార్కెట్ల సానుకూలతతో పరుగులు పెట్టిన సూచీలు ఆ తర్వాత బ్యాంకింగ్, వాహన రంగాల స్టాక్స్‌లో నెలకొన్న వాటాల విక్రయాల వత్తిడితో తిరిగి అంతేవేగంగా దిగివచ్చాయి.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా ఖండ దేశాల స్టాక్ మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీతోబాటు హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ సోమవారం లాభాల్లో ముగిశాయి. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక మాంద్యాన్ని సరిదిద్దే దిశగా చర్యలకు ఉపక్రమించడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు సానుకూల అంశంగా మారిందని విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలతోనే సాగాయి. ఇలావుండగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం 30 పైసలు నష్టపోయి ఇంట్రాడేలో రూ. 71.46గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 0.56 శాతం పెరిగి బ్యారెల్ 58.97 డాలర్లుగా ట్రేడైంది.