బిజినెస్

రైతులకు నూరు శాతం రాయితీతో విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి నూరుశాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు సమీపంలోని లాం ఫారంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కృష్ణానది వరదలతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, గోదావరి వరదలతో ఉభయ గోదావరి జిల్లాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
కృష్ణాజిల్లాలో 4,385, గుంటూరులో 5,600, తూర్పు గోదావరిలో 4,968, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,375 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధిచెబుతారన్నారు.
వరద నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్‌లను వినియోగిస్తే టీడీపీ నేతలు రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ ఫర్నీచర్‌ను ఇంటికి ఎందుకు తీసుకెళ్లారో తెలియదని, ఈ సంఘటనపై పోలీసు విచారణ జరుగుతుందని తెలిసి తానే తీసుకెళ్లానని చెప్పడం స్పీకర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తికి తగదన్నారు. మాజీ స్పీకర్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టంచేశారు.
దుష్ట రాజకీయాలు టీడీపీకే చెల్లు: మోపిదేవి
వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దుష్ట రాజకీయాలు చేయడం టీడీపీ నేతలకే చెల్లిందని రాష్ట్ర మార్కెటింగ్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం జగన్మోహనరెడ్డి విదేశీ పర్యటనకు వెళితే విహార యాత్రలకు వెళ్లారంటూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అంబ టి రాంబాబు, ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు కన్నబాబు, మోపిదేవి