బిజినెస్

అమెజాన్‌లో ఆన్‌లైన్ తెలుగు బుక్‌స్టోర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 29: ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్‌డాట్‌ఇన్.. తెలుగు పుస్తకాల కోసం ఓ ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌ను ప్రారంభించింది. ఇందులో 10వేలకుపైగా వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు లభిస్తాయని సోమవారం తెలిపింది. క్లాసిక్స్, లిటరేచర్, ఫిక్షన్, బయోగ్రఫీస్, బిజినెస్, ఫైనాన్స్, సెల్ఫ్-హెల్ప్, వంటల పుస్తకాలు తమ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని వివరించింది. బివి పట్ట్భా రామ్, రంగనాయకమ్మ, యద్ధనపూడి సులోచనా రాణి, మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్ తదితర ప్రముఖ రచనలున్నాయన్న అమెజాన్.. ఆర్డర్ చేసిన కస్టమర్లకు ఇంటివద్దకే పుస్తకాలను తెచ్చిస్తామంది. కాగా, ఇప్పటికే హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, మలయాళం, గుజరాతి, బెంగాలీ భాషల పుస్తకాల కోసం అమెజాన్ ఆన్‌లైన్ బుక్‌స్టోర్లను నడిపిస్తోంది.