బిజినెస్

సరికొత్త గరిష్టానికి పసిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: బంగారం ధరలు బుధవారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) బంగారంపై రూ. 50 పెరిగి మొత్తం ధర రూ. 38,829కి చేరింది. ఆభరణ వ్యాపారుల నుంచి స్థిరమైన కొనుగోళ్ల మద్దతు లభించడం వల్లే ఇలా పసిడి ధరలు పెరిగాయని ‘ఆలిండియా సరాఫా అసోసియేషన్’ వర్గాలు తెలిపాయి. ఇలావుండగా మంగళవారం ధరలు తగ్గిన వెండికి సైతం బుధవారం డిమాండ్ పెరిగి కిలోపై రూ. 1,140 ధర పెరిగింది. మొత్తం ధర రూ. 45.040గా ట్రేడైంది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల మార్కెట్ల నుంచి కొత్తగా ఏర్పడిన డిమాండ్ నేపథ్యంలో వెండి ధరలకు సైతం రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావం వెండి, బంగారంపై మరింతగా లాభాలు వచ్చే అవకాశాలను దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో సైతం పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం వల్ల బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయని అంటున్నారు. అంతర్జాతీయంగా న్యూయార్క్‌లో స్పాట్ గోల్డ్ మాత్రం ధరల్లో స్థిరత్వం కనబరుస్తోంది. అయితే ఈ బంగారం ఔన్స్ 1,500 డాలర్ల స్థాయిని మించకపోవడం గమనార్హం.
బుధవారం అక్కడ ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1,499 డాలర్లు పలికింది. అమెరికన్ ఫెడరల్ ద్రవ్య వినిమయ విధాన సింపోజియం సమావేశంలో శుక్రవారం నాడు ప్రసంగించనున్న చైర్మన్ జరోమ్ పావెల్ చేసే ప్రకటనను బట్టి బంగారం ధరల ప్రభావం కొనసాగుతుందని ప్రముఖ సీనియర్ విశే్లషకుడు తపన్‌పటేల్ తెలిపారు. ఇక దేశ రాజధానిలో బుధవారం 99.9 శాతం స్వచ్ఛ బంగారం ధర 10 గ్రాములు రూ. 38,820, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ. 38,650 వంతున ట్రేడయ్యాయి. ఇక ఎనిమిది గ్రాముల సవరం బంగారంపై రూ. 200 పెరిగి మొత్తం ధర రూ. 28,800 పలికింది. అలాగే వెండి ధరలు సైతం కిలోపై రూ. 1,140 పెరిగి మొత్తం ధర రూ. 43,632కు చేరింది. ఇక వెండి నాణేలకు డిమాండ్ బాగా పెరిగింది. 100 పీసులపై రూ. 2వేలు పెరిగి కొనుగోళ్లలో రూ.91 వేలు, అమ్మకాల్లో రూ. 92 వేల వంతున ట్రేడైంది.