బిజినెస్

ఆర్థిక మాంద్యంతోనే నిరాశాజనక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 21: గడచిన జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో వివిధ కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ఆర్థిక మాంద్యమే ప్రధాన కారణమని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ‘కేర్ రేటింగ్స్’ అధ్యయన నివేదిక వెల్లడించింది. ప్రధానంగా ‘ఇండియా ఇన్క్’ నికర విక్రయాల వృద్ధి గడచిన జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 4.6 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో 13.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. అలాగే నికర లాభాలు సైతం గత ఏడాది వచ్చిన 24.6 శాతం నుంచి తాజాగా 6.6 శాతానికి పడిపోయింది. మొత్తం 2,976 కంపెనీల త్రైమాసిక ఫలితాలను విశే్లషించిన అనంతరం ఈ నివేదికకు తుదిరూపం ఇస్తున్నట్టు కేర్ రేటింగ్స్ పేర్కొంది.