బిజినెస్

పూర్తి స్థాయిలో సంప్రదాయేతర విద్యుత్‌కు మారడం అసంభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 21: పునరుత్పాదక విద్యుత్ భవిష్యత్తులో సంప్రదాయ విద్యుత్ వినియోగ స్థానాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించే అవకాశాలు ఎంతమాత్రం లేవని కోల్ ఇండియా చైర్మన్ అనిల్‌కుమార్ ఝా బుధవారం నాడిక్కడ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే సంప్రదాయ విద్యుత్ వినియోగం నుంచి మారే విషయంలో మనదేశంలో ప్రత్యేక పరిస్థితులున్నాయని ఆయన తెలిపారు. దేశంలో 83 శాతం బొగ్గు ఉత్పత్తి కోల్ ఇండియా ద్వారా జరుగుతోందన్నారు. ఐతే ప్రస్తుతం ఉన్న సంప్రదాయ విద్యుత్ స్థానంలో సంప్రదాయేతర విద్యుత్ వినియోగం పూర్తి స్థాయిలో జరుగుతుందా? అన్నది ప్రశ్నార్థకమని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యం కాదన్నారు. దేశ విద్యుత్ ఉత్పాదనలో కోల్ ఇండియా ప్రాముఖ్యత భవిష్యత్తులో మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని బుధవారం నాడిక్కడ జరిగిన కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా వాటాదారులకు ఝా భరోసా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంప్రదాయేతర విధానాల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి జరుగుతున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో మనదేశంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయన్నారు. దేశంలో కొత్తగా రూ. 9,093 కోట్ల వ్యయ అంచనాలతో 69.88 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో తొమ్మిది బొగ్గుగని ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతించిందని ఝా గుర్తు చేశారు. అంతేకాకుండా రూ. 6,656 కోట్ల వ్యయ అంచనాలతో రెండు విద్యుత్ రైల్వే ప్రాజెక్టులకు సైతం అనుమతించడం జరిగిందని తెలిపారు. తొలిసారి కోల్ ఇండియా 600 మిలియన్ టన్నుల ఉత్పత్తి మార్కును అధిగమించి 606.14 మిలియన్ టన్నుల డ్రై ఫ్యూయల్ ఉత్పత్తి చేయడం జరిగిందని గత ఏడాది సాధించిన 4.8 శాతం అధిక ఉత్పత్తిని మించి ఈ ఏడాది 6.78 శాతం అదనపుఉత్పత్తి జరిగిందని ఝా వివరించారు. ఐతే కోల్ ఇండియా వాటా ధరలు జీవిత కాల కనిష్టం రూ. 200లకు చేరుకోవడం పట్ల ఝా అసహనంగా ఉన్నారని, అందుకే ఆయన ప్రసంగంలో అది ప్రతిబింబించిందని వాటాదారులు పేర్కొన్నారు. ఈ సమావేశ తొలి సెషన్‌కు విలేఖరులను అనుమతించలేదు. మధ్యాహ్నం సీనియర్ అధికారులు వచ్చి విలేఖరులను అనుమతించారు. ఇలావుండగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి త్వరలో ఇక్కడి కంపెనీ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.