బిజినెస్

విభిన్న వర్గాల ప్రయోజనం కోసమే ఆదాయపు పన్ను వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: సమాజంలోని విభిన్న వర్గాల ప్రయోజనం కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయపు పన్ను వసూళ్లను వినియోగిస్తాయన్న విషయాన్ని మరువరాదని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అలాగే పన్ను చెల్లింపు దారుల సంఖ్య కూడా గణనీయంగా పెరగటం శుభపరిణామనన్నారు. ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి చిహ్నమని, సమాజ ప్రయోజనాల కోసనే పన్ను చెల్లిస్తున్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఆదాయపు పన్నుల శాఖ నూతనంగా రూపొందంచిన ‘కర్దాతా ఇ - సహ్యోగ్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రారంభించారు. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ దానిని ఆవిష్కరించారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇ - ఫైలింగ్ - హెల్ప్ డెస్క్‌లో భాగంగా ఆ శాఖ ఈ నూతన విధానాన్ని సిద్ధం చేసిందన్నారు. విజయవాడ ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ ఎం భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 31లోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకుంటే రూ. 5 వేల నుండి పదివేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు ఇ - ఫైలింగ్, ఆన్‌లైన్ ఫైలింగ్ వంటి వాటిని సులువైన ప్రక్రియగా మార్చామన్నారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ పన్ను పత్రాల దాఖలు విషయంలో అలసత్వం కూడదని, ఆ శాఖ నూతనంగా తీసుకువచ్చిన కార్యక్రమం అనుసరణీయంగా ఉందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 9047 కోట్ల ఆదాయపు పన్ను వసూలు కాగా, 2019-20 సంవత్సరం కోసం రూ. 11308 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించారు. ఏపీలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య 7.32 లక్షలకు చేరిందన్నారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఆదాయపు పన్ను శాఖ సంయుక్త కమిషనర్ సంధ్యారాణి, సహాయ కమిషనర్ శే్వత, టాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.