బిజినెస్

కోలుకున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 23: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయంగా కోలుకున్నాయి. వరుసగా మూడు రోజుల నష్టాలతో సతమతమైన మార్కెట్లకు విదేశీ పెట్టుబడులపై పన్ను విషయంలో కొన్ని సరళరత నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చన్న ఊహాగానాలు ఊతమిచ్చాయి. అలాగే ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చే కొన్ని చర్యలకు సైతం ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూలతతో ఉందన్న అంచనాలు సైతం మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపాయి. అంతేకాకుండా వాహన రంగ పునరుత్తేజానికి సైతం చర్యలు ఉంటాయన్న అంచనాలున్నాయి. ఈక్రమంలో బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ శుక్రవారం 228 పాయింట్లు లాభపడింది. తొలుత నష్టాలతోనే ఆరంభమైన ట్రేడింగ్‌లో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 350 పాయింట్ల వరకు పతనమైంది. ఐతే ప్రస్తుతం తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ల సమయం ముగిసిపోయిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేఖరులతో మాట్లాడతారన్న ప్రకటన మదుపర్లలో ఆశలు చిగురింపజేసింది. మార్కెట్ల దుస్థితిని చక్కదిద్దే కార్యాచరణను మంత్రి ప్రకటించవచ్చన్న అంచనాల నడుమ వాటాల విక్రయాలకు స్వస్తి చెప్పిన మదుపర్లు కొనుగోళ్లకు దిగారు. దీంతో ఒక్క సారిగా సూచీలు పరుగులు పెట్టాయి. సెనె్సక్స్ మొత్తం 228.23 పాయింట్ల ఆధిక్యతతో 0.63 శాతం లాభాలతో 36,701.16 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 88 పాయింట్ల ఆధిక్యతతో 0.82 శాతం లాభపడి 10,829.35 పాయింట్ల ఎగువ స్థాయిలో స్థిరపడింది. ఈ ప్యాక్‌లోని 50 సంస్థల్లో 41 లాభపడ్డాయి. ఏది ఏమైనప్పటికీ రెండు సూచీలు వారం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఈ వారం రోజుల్లో సెనె్సక్స్ 649.17 పాయింట్లు (1.74 శాతం) నష్టపోగా, నిఫ్టీ 218.45 పాయింట్లు (1.98 శాతం) నష్టపోయింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో వేదాంత అత్యధికంగా 6.55 శాతం లాభపడింది. అలాగే యెస్ బ్యాంకు సైతం 5.24 శాతం లాభాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఓఎన్‌జీసీ 4.26 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.26 శాతం లాభపడ్డాయి. హెవీ వెయిట్స్ ఆర్‌ఐఎల్ సూచీ 2.36 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.09 శాతం లాభపడి మార్కెట్లకు లాభాలకు ఊతమిచ్చాయి. మరోవైపు ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 1.9 శాతం నష్టపోయింది. ఇప్పటికే కంపెనీల త్రైమాసిక నిరాశాజనక ఫలితాలు, జీడీపీ గణాంకాలతో దేశీయ మార్కెట్లపై ఏమాత్రం ఆసక్తి లేని మదుపర్లలో మళ్లీ సానుకూల దృక్పథాన్ని పాదుకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని వాణిజ్య రంగ ప్రముఖుడు వినోద్ నాయర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
కాగా విద్యుత్ వాహనాల విడుదలకు ఎలాంటి ఆఖరు తేదీని ప్రకటించలేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితన్‌గడరీ పేర్కొనడం వాహన రంగ షేర్లకు బాసటగా మారింది. దీంతో ఎం అండ్ ఎం 4.26 శాతం, టాటా మోటార్స్ 3.25 శాతం, హీరోమోటోకార్ప్ 0.61 శాతం లాభపడ్డాయి. మారుతీ సుజకీ మాత్రం రోజులో అధిక భాగం నష్టాల్లోనే సాగి చివరికి .69 శాతం లాభాలతో గటెక్కింది. ఫ్యూయెల్ హోస్ మెకానిజంతో ఇటీవలే ఈ దిగ్గజ సంస్థ విడుదల చేసిన 40,618 వేగానర్ వాహనాలను వెనక్కు తీసుకోనున్నట్టుగా తాజాగా ప్రకటించడం జరిగింది. కాగా ఐటీ దిగ్గజం టీసీఎస్ 1.47, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా 0.75 శాతం లాభాలను సంతరించుకున్నాయి. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటులో కోతను ప్రకటించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వాటాలు 1.01 శాతం లాభపడ్డాయి.
మరోవైపు ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్ 1.71 శాతం నష్టపోయింది. అలాగే ఫ్యూచర్ రీటెయిల్ సంస్థ 5.67 శాతం నష్టపోయింది. ఈ సంస్థలో 49 శాతం వాటాలను సొంతం చేసుకోనున్నట్టు ఇటీవల అమెజాన్ ప్రకటించింది. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్ సూచీ 0.55 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 66.68 శాతం వృద్ధిని నమోదు చేసి 12,119.43 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. చమురు, సహజవాయులు 3.35 శాతం, టెక్ సూచీ 1.16 శాతం లాభపడ్డాయి. అలాగే ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.