బిజినెస్

ఆర్థిక ఉత్తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతాన్నిచ్చే అనేక కీలక నిర్ణయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శుక్రవారంనాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె దేశ ఆర్థికాభివృద్ధి విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ వృద్ధి కంటే కూడా భారత జీడీపీ వేగంగానే విస్తరిస్తోందని ఆమె పేర్కొన్నారు. గృహ, వాహన, వినియోగ వస్తువుల కొనుగోళ్లపై రుణాలను మరింత చౌకగా అందుబాటులో వచ్చేలా సీతారామన్ పలు నిర్ణయాలు ప్రకటించారు. బ్యాంకింగ్ ద్వారానే కాకుండా ఎన్డీఎఫ్‌సీల ద్వారా కూడా ఈ రుణాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ద్వారా కూడా ఆర్బీఐ రేటు తగ్గుదల ప్రయోజనాన్ని బ్యాంకులు రుణ గ్రహీతలకు అందిస్తాయని ఆమె తెలిపారు. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోళ్లు, ఇతర రిటైల్ రుణాలకు తేలిగ్గా, నెలవారీ వాయిదాల చెల్లింపు సౌకర్యం కల్పిస్తామని, ఇందులో భాగంగా బ్యాంకులు రెపో రేటుతోపాటు రుణాలతో అనుసంధానమైన బాహ్య బెంచ్ మార్క్‌ను ప్రారంభిస్తాయని ఆమె తెలిపారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అదనంగా మరో 20 వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి తెస్తామని ఆమె అన్నారు. దీనివల్ల మొత్తం
నిధుల లభ్యత మొత్తం 30 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని ఆమె తెలిపారు. రుణాల మంజూరు ప్రక్రియలను మరింత సులభతరంగా మార్చేందుకు పీఎంఎల్‌ఏ, ఆధార్ నిబంధనలు సడలించాలని నిర్ణయించినట్టు తెలిపారు. పరిశ్రమలకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు క
కూడా మరింత చౌకగానే లభిస్తాయని ఆమె అన్నారు. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరులో మరింత పారదర్శకతను తీసుకువస్తామని, రుణాల చెల్లింపు ముగిసిన 15 రోజు వ్యవధిలోనే సదరు డాక్యుమెంట్లను తిరిగి ఇచ్చేసేలా నిబంధనలు తీసుకువచ్చామని ఆమె అన్నారు. ఆస్తుల తనఖాపై రుణాలు తీసుకున్నవారికి ప్రయోజనం కలుగుతుందని ఆమె అన్నారు. ద్రవ్య లభ్యత కొరతను ఎదుర్కొంటున్న ఎంఎఎస్‌ఎన్‌ఈకి కూడా ఆర్థికమంత్రి ఊరట కల్పించారు. ఈ సంస్థలకు చెందిన పెండింగ్ జీఎస్టీ రిఫండ్‌లను 30 రోజుల వ్యవధిలోనే చెల్లిస్తామని, ఇకముందు దరఖాస్తు చేసుకున్న 60 రోజుల వ్యవధిలోనే వీటికి రీఫండ్‌లను చెల్లించడం జరుగుతుందని ఆమె తెలిపారు. సంక్షోభంలో పడ్డ ఆటోరంగాన్ని ఆదుకునేందుకు ఆర్థిక మంత్రి వెసులుబాటుతో కూడిన ఎన్నో చర్యలను ప్రకటించారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజును వాయిదా వేశారు. పెట్రోలు, డీజిల్ వాహనాల కొనుగోళ్లపై నిషేధాన్ని ఎత్తివేశారు. అయితే, జీఎస్టీ రేటు తగ్గింపులో మాత్రమ ఆమె ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అలాగే, ఈక్విటీ మార్కెట్లకు కూడా ఆర్థికమంత్రి వెసులుబాటు కల్పించారు. విదేశీ పోర్టుపోలియో, దేశీయ ఈక్విటీ ఇనె్వస్టర్లపై విధించిన సూపర్ రీచ్ సర్‌చార్జ్‌ను రద్దు చేస్తున్నట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా బడ్జెట్ ముందున్న పరిస్థితిని పునరుద్ధరిస్తున్నామని ఆమె వెల్లడించారు.
అనుమానాలొద్దు
భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని, అంతా సవ్యంగానే సాగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వృద్ధి అజెండా విషయంలోనూ ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే వేగంగానే భారత స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి చెందుతోందని ఆమె తెలిపారు. ఆర్థిక సంస్కరణలను నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తోందని, తమ అజెండాలో దీనికే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు. జీడీపీ వృద్ధిరేటు అంచనాలు 3.2 శాతం కంటే దిగువకు కుదించే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన సీతారామన్ ‘అంతర్జాతీయంగా వినియోగ డిమాండ్ బలహీనపడింది’ అని అన్నారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రపంచ మార్కెట్ కంటే ముందే ఉందని, అనేక ప్రధాన దేశాల కంటే కూడా మెరుగైన వృద్ధినే సాధిస్తోందని ఆమె తెలిపారు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం, కరెన్సీ విలువ తగ్గించిన కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఒడిదుడుకుల పరిస్థితి తలెత్తిందని ఆమె తెలిపారు. ఆర్థిక సంస్కరణల వేగాన్ని ఎంతమాత్రం తగ్గించలేదని, ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పినట్టు సంపదను సృష్టించేవారికి విశేష గౌరవాన్ని కల్పిస్తున్నామని ఆమె అన్నారు. .