బిజినెస్

జన్‌ధన్ జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశ ఆర్థికమంత్రిగా, రక్షణ మంత్రిగా ఎన్నో కీలక సంస్కరణలకు జైట్లీ నాంది పలికారు. ఇటు ఆర్థికరంగంలోను, అటు సామాజిక రంగంలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో ప్రభావశీలతను కనబరిచాయి. ముఖ్యంగా 2014లో మోదీ ప్రభుత్వం తొలిసారిగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక కీలక నిర్ణయాల్లో జైట్లీ కీలక పాత్ర ఉంది. దేశ ప్రజలందరి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేసే జన్ ధన్ యోజనకు సూత్రధారి జైట్లీ. 2014లో ప్రవేశపెట్టిన ఈ పథకం మోదీ సర్కారుకు విశేష జనాదరణను అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా ప్రజలు నిలదొక్కుకోవడంలో చేయడంలో ఈ పథకం ఎంతగానో దోహదం చేసింది. ఈ పథకంతోపాటు బీమా, పెన్షన్, జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు కూడా తెరవడం వల్ల అసలు బ్యాంక్ ఖాతా అంటే ఏమిటో తెలియనివారికి కూడా ఈ లావాదేవీలు ఒంటబట్టాయి. అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు కూడా జైట్లీ ఆర్థికమంత్రిగా ఉన్నపుడే జరిగింది. పరోక్ష పన్నుల వ్యవస్థకు స్వస్తిపలికి, జీఎస్టీని తీసుకువచ్చిన ఆయన దివాళా కోడ్‌ను కూడా ఆయన అమల్లోకి తెచ్చారు. ఆవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తిరుగులేని ముద్ర వేశారు జైట్లీ. పెద్దనోట్ల రద్దు మోదీ సర్కారు తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం. దేశంలోని నల్లధనాన్ని వెలికితీయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ నిర్ణయం కూడా జైట్లీ ఆర్థికమంత్రిగా ఉన్నపుడే జరిగింది. ఇలా మొత్తం ఎనిమిది కీలక నిర్ణయా లు తీసుకున్న ఆయన వాటి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా సంస్కరణల వైపు పరుగులు పెట్టించారు. రాని బాకీల కూపంలో చిక్కుకున్న బ్యాంకులను లక్ష కోట్లకు పైగా ఆర్థిక దన్నును అందించి ఆదుకున్నారు.
ఎమర్జెన్సీ.. యోదుడు
అది 1975 సంవత్సరం, జూన్ 26వ తేదీ. ఉదయం అత్యవసర (ఎమర్జెన్సీ) పరిస్థితికి వ్యతిరేకంగా అరుణ్ జైట్లీ కొంత మంది యువకులతో కలిసి రోడ్డుపైకి వచ్చి ప్రధాని ఇందిరా గాంధీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మొదటి సత్యాగ్రహిగా జైట్లీకి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అరుణ్ జైట్లీని అదుపులోకి తీసుకున్నారు. 1975 నుంచి 1977 సంవత్సరం వరకు (19 నెలల పాటు) జైట్లీ జైలు జీవితాన్ని గడిపారు. 1975 సంవత్సరం జూన్ 25వ తేదీ అర్థరాత్రి నుంచి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. ఆ అర్థరాత్రే జైట్లీని పోలీసులు రంగంలోకి దిగినా, జైట్లీ వారి కంట పడకుండా పారిపోయి స్నేహితుని ఇంట్లో గడిపి, తెల్లవారు జామున కొంత మందిని వెంట తీసుకుని రోడ్డుపైకి వెళ్ళి ఇందిరా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అప్పుడే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. కోర్టుకు హాజరుపరిచిన మొదటి వ్యక్తి కూడా జైట్లీనే. కోర్టు ఆయనకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. మొదటి సత్యాగ్రహిగా గుర్తింపబడినట్లు జైట్లీ తన జీవిత చరిత్ర (డిఫైనింగ్ ఇండియా) పుస్తకంలో పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి జైట్లీ శనివారం ఏయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబీవిపి)లో చురుగ్గా పాల్గొని ఆ విద్యార్థి సంఘానికి నాయకుడయ్యారు. 1970 సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. న్యాయవాది వృత్తి నుంచి రాజకీయ నాయకునిగా మారిన జైట్లీకి పుస్తకాలు చదవడంలో, రాయడంలో అభిరుచి ఎక్కువగా ఉండేది. జైలులో ఉన్నప్పుడే అసెంబ్లీ నియమ, నిబంధనల గురించి, చర్చల గురించి పుస్తకాలు తెప్పించుకుని చదివేవారు.
బీజేపీ అగ్ర నాయకులైన అటల్ బీహారీ వాజ్‌పేయ్, ఎల్‌కె అద్వానీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్తలైన దేశ్‌ముఖ్‌తో అనేక విషయాలపై చర్చించే వారు. పంజాబ్‌కు చెందిన జైట్లీ ఎటువంటి సమస్యకైనా సునాయసంగా పరిష్కరించేలా ఉపాయం చెబుతూ పార్టీలో అందరికీ ఆప్తులయ్యారు.