బిజినెస్

నిత్యావసర వస్తువులు.. ఔషధాలకు కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువులు, ఔషధాలకు ఏ మాత్రం కొరత లేదని జమ్మూ-కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. కమ్యూనికేషన్స్ వ్యవస్థను నిరోధించడం వల్ల చాలా ప్రాణాలను కాపాడగలిగామన్నారు. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత ప్రశాంతమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఏ ఒక్క చిన్న ఘటన కూడా జరగలేదన్నారు. ఈ 10 రోజుల్లో ఒక్కరు కూడా మరణించలేదని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కమ్యూనికేషన్ల వ్యవస్థను ఎంత కాలం నిరోధిస్తారన్న విలేఖరుల ప్రశ్నలకు గవర్నర్ సరైన సమాధానం చెప్పకుండా కాశ్మీర్‌లో సంక్షోభం ఉన్నప్పుడు అనేక ఘోరాలు జరిగాయన్నారు. ఏ ఒక్కరి ప్రాణం పోరాదన్నారు. ‘10 రోజులు ఫోన్లు పని చేయవు, అవి పని చేయకపోతే ఏమవుతుంది?’ అని ఆయన ప్రశ్నిస్తూ త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయని గట్టిగా చెప్పారు. జమ్మూ-కాశ్మీర్‌లో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. బక్రీదు పండుగ సందర్భంగా అవసరమైన వారి ఇంటి గుమ్మం వరకూ మాంసం, ఆకుకూరగాయలు, కోడి గుడ్లు అందించామని గవర్నర్ సత్యపాల్ వివరించారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణించడంతో సత్యపాల్ మాలిక్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. జైట్లీ భౌతికకాయంపై ఆయన పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు.