బిజినెస్

మళ్లీ స్టేషనరీ విక్రయాల్లో రెండంకెల వృద్ధిరేటును సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: వివిధ రకాల ఇతర వాణిజ్యాల వైపు అడుగులేస్తున్న ఇండియన్ టొబాకో కంపెనీ (ఐటీసీ) తన స్టేషనరీ వ్యాపారంలో మళ్లీ రెండంకెల వృద్ధి రేటును వచ్చే డిసెంబర్ నాటికి సాధిస్తామన్న ధీమాను ఆదివారం నాడిక్కడ వ్యక్తం చేసింది. ఆర్థిక మాంద్యం, వరదల కారణంగా తగ్గిన విక్రయాల నేపథ్యంలో గడచిన ఆరు నెలల కాలంగా ఈ సంస్థ సేషనరీ విక్రయాల వృద్ధిరేటు సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. ఈ సంస్థ ప్రాథమికంగా సుమారు 1500 కోట్ల రూపాయల విలువైన ‘క్లాస్‌మేట్ బ్రాండ్’ ఉత్పత్తులతో కూడిన స్టేషనరీని సైతం విక్రయాలు జరుపుతోంది. ఈక్రమంలో కొత్త ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా ప్రస్తుత మాంద్యం వల్ల తలెత్తిన సమస్యను, ఇతర సవాళ్లను వచ్చే అక్టోబర్ నాటికే అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థకు చెందిన విద్య, స్టేషనరీ ఉత్పత్తుల వాణిజ్య విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శైలేంత్ర త్యాగి తెలిపారు. సాధారణంగా పాఠశాలలు మొదలైతే విద్యార్థులు పెద్దమొత్తాల్లో పుస్తకాలు, స్టేషనరీ కొనుగోలు చేస్తారు. ఐతే ప్రస్తుతం ఈ రకమైన కొనుగోళ్లను అధిక శాతం విద్యార్థులు వాయిదా వేసుకోవడం కనిపించిందని ఆయన తెలిపారు. ట్యూషన్లకు, ఇతర రఫ్ వర్క్‌లకు వినియోగించే రఫ్‌బుక్స్ కొనుగోలు సైతం తగ్గుముఖం పట్టిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదలు వచ్చిన కారణంగా పాఠశాలలు మూసివేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు తలెత్తడం వల్ల తమ ఉత్పత్తుల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ఇకపై మళ్లీ పరిస్థితులు చక్కబడతాయని డిసెంబర్ నాటికి విక్రయాలు పూర్వ వైభవం సంతరించుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల తమ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కాస్‌మేట్ పల్స్ 3డీ నోట్‌బుక్ ప్రత్యేకతను సంతరించుకుందని, అలాగే కాస్‌మేట్ పల్స్ ఇంటర్ చేంజబుల్ నోట్‌బుక్కులు, సెల్ఫీ నోట్‌బుక్స్ సైతం విభిన్నమైన కవర్లతో ఆకట్టుకుంటున్నాయని ఆయన తెలిపారు.