బిజినెస్

ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం.. ఆర్థికాభివృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశాన్ని 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తయారు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తోడ్పడతాయని ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక స్థితిని బలపేతం చేయాలంటే బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ అవసరమని ఆదివారం నాడిక్కడ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మనకు బలోపేతమైన ఆరు మెగా బ్యాంకులు ఉన్నాయని వాటి మూలధన నిల్వలు పెరిగాయని, బ్యాంకుల పరిమాణంతోబాటు పనితీరు, నిపుణత పెరిగాయని ఆయన తెలిపారు. స్థూలంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే ఇలాంటి చర్యలు అత్యంత ఆవశ్యకమని ఆయన అన్నారు. ఇలా బలోపేతమైన బ్యాంకులు అంతర్జాతీయ బ్యాంకులతో పోటీపడడంతోబాటు మరింత విస్తృత స్థాయి సమన్వయంతో పనిచేయగలుగుతాయని ఆయన తెలిపారు. విస్తరించిన వాణిజ్య దృక్పథంతోబాటు రుణాల మంజూరు సామర్ధ్యం పెరిగిందని, అలాగే మరిన్ని సాంకేతిక విలువలు, ఉత్పత్తులతో ఖాతాదారులకు సేవలందించే అవకాశం కలిగిందన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ బ్యాంకింగ్ రంగాన్ని మరింత బాధ్యతాయుతంగా, స్వచ్ఛంగా, సాంకేతికంగా మార్చాలన్న దృక్పథంతో ముందుకెళుతున్నట్టు రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. వాటాదారుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలుగకుండా ఆర్థికపరమైన అంశాలపై నిర్ధిష్టమైన ఆడిటింగ్ నిర్వహణతోబాటు, రుణ గ్రహీతలు, అన్ని బ్యాంకులు, రేటింగ్ ఏజెన్సీలతో అనుసంధానమై పనిచేయడం జరుగుతుందన్నారు. స్థూలంగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా దేశాన్ని తయారు చేయడమే ప్రధాన ధ్యేయమని ఆయన చెప్పారు. పెద్ద బ్యాంకులకు అవసరానికి మించి ప్రభుత్వం 0.25 శాతం అదనంగా మూలధనాన్ని కేటాయించడం జరుగుతోందని, స్థానికావసరాలకు అనుగుణంగా పనితీరును మెరుగుపరిచేందుకే ఈ కేటాయింపులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. బేసెల్-3 మార్గదర్శకాల పరిమితికంటే భారతీయ బ్యాంకులు ఒక శాతం అధికంగా కీలక మూలధన నిల్వలు కలిగివున్నాయని ఆయన తెలిపారు. గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో అనుసరించిన విధంగానే సంబంధిత బ్యాంకుల బోర్డులతో చర్చించిన మీదట విలీన తేదీని ఖరారు చేయడం జరగుతుందన్నారు. ఇందుకు సంబంధించి అనేక నిబంధనలు అమలు చేయాల్సి ఉందని ప్రధానంగా కొన్ని నియంత్రణ అంశాలకు ఆమోదం లభించాల్సివుందని, ఈక్రమంలో బ్యాంకులకు సజావుగా విలీన ప్రక్రియ జరిపేందుకు అనువైన సమయం ఉందని రాజీవ్‌కుమార్ తెలిపారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 1 మధ్యే ఈ విలీన తేదీలు ఉండాల్సి వుందన్నారు.
చిత్రం...కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్