బిజినెస్

బ్యాంకుల బలోపేతానికే విలీనం నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : భారతీయ బ్యాంకులను పటిష్టపరచాలన్న ఉద్దేశంతోనే విలీన నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల ఏ ఒక్కరి ఉద్యోగమూ పోదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పలు బ్యాంకుల విలీనం నేపథ్యంలో అనేక పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తుతున్న దృష్ట్యా సీతారామన్ ఈ వివరణ ఇచ్చారు. ‘ఉద్యోగాలు పోతాయన్న మాటలు ఒట్టి వదంతులే. గత శుక్రవారం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు నేను చేసిన ప్రకటనను సరైన స్ఫూర్తితో అర్థం చేసుకోండి. ఏ ఒక్కరి ఉద్యోగమూ పోదన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగానే వెల్లడించాను’ అని ఆమె బ్యాంకుల యూనియన్లకు స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్ బ్యాంకుల విలీనానికి సంబంధించిన అంశంపై వివరణాత్మక రీతిలో సమాధానం చెప్పారు. బ్యాంకులు మూతపడతాయన్న వాదన కూడా సరైనది కాదని, ఉన్న వ్యవస్థను మరింత సమర్ధంగా నడిపించాలనే తాము కోరామని పేర్కొన్న ఆమె ‘కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలని ఏ బ్యాంకుపైనా ఒత్తిడి తేవడంలేదు’ అని స్పష్టం చేశారు. తాజా విలీనం వల్ల బ్యాంకులకు ఆర్థిక పుష్టి పెరుగుతుందని, అవి మరింత బలంగా పనిచేసే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందన్న విమర్శలను ప్రస్తావించిన సీతారామన్ ఆయా పరిస్థితులను బట్టి వివిధ రంగాలవారీగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశంపైనా దృష్టిపెట్టామని, తగిన పరిష్కారాలను సూచిస్తున్నామని ఆమె తెలిపారు. జీఎస్టీ నుంచి తమను మినహాయించాలంటూ ఆటోమొబైల్ రంగం చేస్తున్న డిమాండ్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది జీఎస్టీ మండలే తప్ప ప్రభుత్వం కాదని ఆమె అన్నారు.

చిత్రం... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్