బిజినెస్

ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 9.1 లక్షల కోట్లకు తగ్గనున్న మొండి బకాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: బ్యాంకుల స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 9.1 లక్షల కోట్లకు తగ్గనున్నాయి. మంగళవారం నాడిక్కడ విడుదలైన ‘బోల్‌స్టరింగ్ ఏఆర్‌సీ’ సంస్థ అధ్యయన నివేదిక ఈవిషయం వెల్లడించింది. ‘అసోచెం-క్రైసిల్’ సంస్థతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్టు బోల్‌స్టరింగ్ ఏఆర్‌సీ సంస్థ ప్రకటించింది. మనదేశానికి చెందిన బ్యాంకుల మొత్తం నిరర్ధక ఆస్తులు (బకాయిలు) గడచిన మార్చి నాటికి రూ. 9.4 లక్షల కోట్లని ఆ నివేదిక తెలిపింది. ప్రస్తుతం కార్పొరేట్ విభాగంలో పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆసిక్తిని బట్టి ఈ రంగంలో 70 శాతం కంపెనీలు కోలుకునే అవకాశాలున్నాయని వివరించింది. దీర్ఘకాలిక మొండి బకాయిలు దాదాపు 5.4 లక్షల కోట్లు మేర ఉండగా కొత్త పెట్టుబడిదారులకు ఈ కంపెనీల్లో అవకాశాలున్నాయని నివేదించింది. జాతీయ కంపెనీ లాట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) జాబితా 1,2 ప్రకారం మొత్తం 2.1 లక్షల కోట్లకు సంబంధించిన వివాదాలు నడుస్తుండగా ఇందులో 2 లక్షల కోట్లు మొండి బకాయిలకు సంబంధించినవి. దీనితోబాటు మరో 1.3 లక్షల కోట్ల రూపాయలు సైతం మొండిబకాయిలున్నప్పటికీ వాటిని నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా పరిగణించడం లేదు. సమీప భవిష్యత్తులో ఈ బకాయిలు సైతం ఎన్‌పీఏ కిందికి మారే అవకాశాలున్నాయని నివేదిక తెలిపింది. ప్రధానంగా విద్యుత్, వౌలికవసతులు, ఉక్కు రంగాల్లో 4.1 కోట్ల మొండి బకాయిలు ఉండగా అందులో సగం బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయని నివేదిక తెలిపింది.