బిజినెస్

అమెరికాతో స్వేచ్ఛా సంబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: అమెరికాతో స్వేచ్చా వాణిజ్య విధానాలను అనుసరించాల్సిందిగా అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఆమ్‌చామ్) భారత్‌కు సూచించింది. స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమ్‌చామ్ అధ్యక్షురాలు తారా జోసెఫ్ తెలిపారు. ద్వైపాక్షిక పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రతినిధులతో ఇటీవల భారత జౌళి పరిశ్రమ మంత్రి స్మృతి ఇరానీ, కార్యదర్శి రవి కపూర్, నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమీతాబ్ కాంత్‌ను సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల వివరాలను తారా జోసెఫ్ ప్రస్తావిస్తూ స్వేచ్చా వ్యాపారం ఒక్కటే ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పటిష్టపరుస్తుందని పేర్కొన్నారు.