బిజినెస్

విశాఖ టు బెంగళూరుకు ఇండిగో విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: విశాఖ నుంచి రాజమండ్రి మీదుగా బెంగళూరుకు విమాన సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ అంగీకారం తెలిపింది. ఈ నెల 16 నుంచి ఈ విమాన సర్వీసు అందుబాటులోకి రానున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ నరేష్ తెలిపారు. ఎయిర్ పోర్టు సలహా కమిటీ సమావేశం విశాఖలో బుధవారం జరిగింది. ప్రస్తుతం రాత్రి సమయంలో విమాన సర్వీసులపై నౌకాదళం ఆంక్షలపై ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా, ఐటీ పరంగా గణనీయమైన ప్రగతి సాధిస్తున్న విశాఖ నుంచి ఆశించిన స్థాయిలో విమాన సర్వీసులు అందుబాటులో లేవని పేర్కొన్నారు. అయితే కొంత ఉపశమనంగా విశాఖ నుంచి గతంలో రద్దు చేసిన విజయవాడ - విశాఖ సర్వీసును తిరిగి కొనసాగించేందుకు ఎయిర్ ఇండియా సంస్థ అంగీకారం తెలిపిందని నరేష్ తెలిపారు. విజయవాడలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి విశాఖకు 8.55కు చేరుకుంటుంది, ఇదే విమానం తిరిగి విశాఖలో రాత్రి 9.20కి బయలుదేరి 10.20గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అలాగే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖకు రాత్రి సమయంలో విమాన సర్వీసును నడపాలని కోరగా ట్రూజెట్ సంస్థ ముందుకు వచ్చింది. ప్రస్తుతం రాత్రి 7.30గంటల తరువాత హైదరాబాద్ నుంచి విశాఖకు విమాన సర్వీసు అందుబాటులో లేదు. తాజాగా ట్రూజెట్ సంస్థ హైదరాబాద్‌లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు విశాఖ చేరుకునేలా సర్వీసును నడపాలని ముందుకు వచ్చిందని, నేవీ అభ్యంతరాలతో ఇది సందిగ్ధంలో పడిందని ఏపీఏటీఏ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం నాటి సమావేశంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విమానాశ్రయ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఏపీఏటీఏ ప్రతినిధులు