బిజినెస్

టన్ను ఇసుక రూ.375

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : నూతన ఇసుక విధానానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గురువారం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇసుక తవ్వకం, రవాణాను ఏపీ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టనుంది. పర్యావరణం దెబ్బతినకుండా, ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త విధానాన్ని రూపకల్పన చేశారు. గతంలో పోలిస్తే ఇసుక ధర తగ్గనుంది. ప్రస్తుతం 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్ల ఏర్పాటు చేస్తారు. అక్టోబర్ నాటికి 80కి పెంచుతారు. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా నిర్ణయించారు. అక్కడి నుంచి రవాణా చార్జీలు అదనం. టన్నుకు ఇసుక రవాణా చార్జీ కిలోమీటర్‌కు రూ.4.90గా నిర్ణయించారు. 10 కిలోమీటర్లలోపు వరకూ ట్రాక్టర్లతో రవాణా చేస్తే రవాణా ఖర్చు 500 రూపాయలు. పట్టా భూముల్లో రైతుల ఆనుమతితో ఏపీఎండీసీ ఇసుక తవ్వక బాధ్యతను చేపడుతుంది. ఇప్పటి వరకూ ఏపీఎండీసీ 100 రీచ్‌లను సిద్ధం చేసింది. 31 చోట్ల డీసిల్టేషన్ చేస్తారు. ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనానికి జీపీఎస్ ఏర్పాటు చేస్తారు. రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు, స్టాక్ పాయింట్ నుంచి వినియోగదారునికి చేరేంత వరకూ వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తారు. అనుమతి లేని వాహనాల ద్వారా ఇసుక రవాణా చేయకూడదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాపై నిషేధం విధించింది. ఈ నెల 10 నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.