బిజినెస్

స్వల్పంగా పెరిగిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయి స్టాక్ మార్కెట్ (బీఎస్‌ఈ)లో బుధవారం లావాదేవీలు ఆశాజనకంగానే కొనసాగాయి. మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, సెనె్సక్స్ 161.83 పాయింట్లు పెరిగి 36,724.74 పాయింట్లకు చేరింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన వెంటనే వివిధ కంపెనీ షేర్ల లావాదేవీలు నష్టాలను ఎదుర్కొంది. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి మెరుగుపడినట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత దారుణ పతనం కనిపించింది. ఒకానొక దశలో సెనె్సక్స్ పాయింట్లు 36,400 పాయింట్లకు పడిపోయింది. అయితే, ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. మొత్తమీద ఆటుపోట్ల మధ్య ట్రేడింగ్ కొనసాగి, చివరకు లాభాల్లో ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో కూడా ఇదేరకంగా ట్రేడింగ్ కొనసాగింది. నిఫ్టీ 46.75 పాయింట్లు పెరిగి 10,844.65 పాయింట్లకు చేరింది. బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అత్యధికంగా 2.97 శాతం లాభాలను ఆర్జించాయి. ఎస్‌బీఐ (2.46 శాతం), టాటా మోటార్స్ (2.40 శాతం), వేదాంత (1.94 శాతం), ఎన్టీపీసీ (1.79 శాతం) షేర్లు కూడా లాభపడ్డాయి. అయితే, మార్కెట్లు నష్టపడినపుడు పతనమైన మారుతీ సుజుకీ కొంతవరకు కోలుకున్నప్పటికీ చివరకు 3.64 శాతం నష్టాలను చవిచూసింది. సన్ ఫార్మా షేర్లు 2.97 శాతం పతనమయ్యాయి. అదేవిధంగా టాటా మోటార్స్ (2.80 శాతం), ఏషియన్ పెయింట్స్ (2.64 శాతం) ఇండస్‌ఇండ్ (1.99 శాతం) కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో టాటా స్టీల్స్ షేర్లు అత్యధికంగా, 2.88 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. అదేవిధంగా బీపీసీఎల్ షేర్లు 2.82 శాతం లాభాలను నమోదు చేశాయి. ఐఓసీ (2.81 శాతం), డాక్టర్ రెడ్డీస్ (2.66 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (2.45 శాతం) షేర్లు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. బీఎస్‌ఈలో దారుణంగా పతనమైన మారుతీ సుజుకీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలోనూ నష్టాలను చవిచూశాయి. ఈ కంపెనీ షేర్లు ఏకంగా 4.04 శాతం నష్టాలను ఎదుర్కోవడం గమనార్హం. సన్ ఫార్మా 3.04 శాతం, బ్రిటానియా 3.02 శాతం, టాటా మోటార్స్ 2.57 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.52 శాతం నష్టాలను చవిచూశాయి.