బిజినెస్

కార్పొరేట్ మోసాలు, చట్టాలకు సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కార్పొరేట్ మోసాలు రోజు రోజుకూ పెరగడం వివిధ చట్టాలకు సవాలుగా మారిందని కేంద్ర సహకార, ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆర్థిక నేరాలు పెచ్చరిల్లుతున్నాయని అన్నారు. దీంతో చాలా చట్టాలకు ఎలాంటి విలువ లేకుండా పోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వ్యాపార, వాణిజ్య స్థితిగతులు గణనీయంగా మారాయని అన్నారు. ప్రపంచ మేటి ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటున్న భారత్‌కు కార్పొరేట్ మోసాలు సమస్యలు సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. చాలా మంది ఉద్దేశపూర్వకంగానే సంస్థలను దివాల తీస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి ఉద్దేశపూర్వక ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉన్నదని ఆయన అన్నారు. ఇందు కోసం అవసరమైతే చట్టాలను సవరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.