బిజినెస్

ఎగుమతుల వృద్ధికి త్వరలోనే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశం నుంచి తగ్గిన ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం త్వరలోనే రత్నాలు, ఆభరణాలు సహా కొన్ని రంగాలకు సంబంధించి చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ చర్యలకు సంబంధించి కేంద్ర ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిపాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ప్రతిపాదన ప్రకారం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజెడ్‌లు)లో ఉన్న యూనిట్లకు కల్పిస్తున్న పన్ను ప్రయోజనాలను తొలగించేందుకు విధించిన గడువును పొడిగించొచ్చు. 2020 మార్చి 31కన్నా ముందు కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త ఎస్‌ఈజెడ్ యూనిట్లకు మాత్రమే ఆదాయపు పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయని కేంద్రం 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి కలర్డ్ జెమ్ స్టోన్స్, పాలిష్ చేసిన వజ్రాలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 7.5 శాతం నుంచి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీజీసీఐ) ఎక్స్‌పోర్ట్ క్రెడిట్‌కు ఇస్తున్న బీమా కవరేజీని ప్రస్తుతం ఉన్న 60 శాతం నుంచి 90 శాతానికి పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల బ్యాంకులు పోటీ పడి మరింత ఎక్స్‌పోర్ట్ క్రెడిట్‌ను అందిస్తాయని భావిస్తున్నారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించి, దిగుమతులను తగ్గించడానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న దేశాల మీదుగా దిగుమతుల దారిమళ్లింపులను నియంత్రించడానికి ‘ఆరిజిన్ క్రైటీరియా’ నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేయాలనే ప్రణాళిక కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది.