బిజినెస్

ఎయిర్ ఇండియాకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 6: ఎయిర్ ఇండియాకు తాత్కాలిక ఊరట లభించింది. సకాలంలో బకాయిలు చెల్లించని కారణంగా ఏయిర్ ఇండియాకు హైదరాబాద్, రాయపూర్ నగరాల్లో ఇంధన సరఫరాను నిలిపి వేయాలన్న ప్రతిపాదనపై ఆయిల్ సప్లయి కంపెనీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో ఇంధన సరఫరా నిలిపి వేత నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడింది.
హైదరాబాద్, రాయపూర్ విభాగాల బకాయిలు, వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయని ఇండియన్ ఆయిల్ నేతృత్వం వహిస్తున్న ఓఎంసీ ఇటీవల ఒక ప్రకటన జారీ చేసింది. ఇవే కారణాల వల్ల పుణే, విశాఖపట్నం, కొశ్చిన్, పాట్నా, రాంచీ, మొహలీ నగరాల్లో ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాను నిలిపి వేసింది. అదేవిధంగా హైదరాబాద్, రాయపూర్ నగరాలకు కూడా ఇంధన సరఫరా చేయరాదని భావించింది. అయితే ఈ ప్రతిపాదనకు ఓఎంసీలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా సమస్యల నుంచి బయటపడింది.