బిజినెస్

వీడియోకాన్ విదేశీ ఆస్తుల విక్రయ ప్రక్రియను ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 9: వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన విదేశాల్లోని చమురు, సహజవాయువుల ఆస్తులను విక్రయించాలన్న ప్రయత్నాలను మానుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) సోమవారం నాడిక్కడ ఆదేశించింది. బ్యాంకులను మోసగించిన కేసుల్లో పీకల్లోతు వరకు కూరుకుపోయిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన విదేశీ ఆస్తుల విక్రయం ద్వారా బకారుూలను రికవరీ చేయాలని ఎస్‌బీఐ భావించింది. ఐతే ఈ విషయంలో యథాతథ స్థితినే కొనసాగించాలని, ఆస్తులు విక్రయించరాదని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. 3ఎస్‌బీఐ ఇప్పటికే ప్రకటించిన విధంగా ఆస్తుల విక్రయ ప్రక్రియను చేపడితే వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు మళ్లీ సరిదిద్దలేనంతగా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని, అందుకే సదరు ఆస్తులన్నీ ఆ గ్రూపు కంపెనీలకు చెందినవా కాదా స్పష్టంగా తెలుసుకోవాలని ఎన్‌సీఆర్‌టీ కోరుతోంద2ని వ్యాఖ్యానించింది. ఉదాహరణకు ఈ అనుబంధ సంస్థలకు ప్రత్యేక అవసరాల వాహనాలు (ఎస్‌పీవీలు) ఉన్నాయని, వీటిని వేణుగోపాల్ ధూత్ సంస్థ వీడియోకాన్ తరపున విదేశీ చమురు, సహజవాయుల నిర్వహణ నిమిత్తం తయారు చేసి ఇవ్వడం జరిగిందని ఎన్‌సీఎల్‌టీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ ప్రత్యేక వాహనాలపై సంబంధిత కంపెనీ తమకు ఫిర్యాదు చేయడం వల్ల తమ న్యాయ విచారణ పరిధిలోకి వచ్చిందని, అందుకే ఎస్‌బీఐని తదుపరి ఆస్తుల విక్రయ చర్యలు చేపట్టకుండా నిరోధిస్తున్నట్టు స్పష్టం చేసింది. తాము తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు యథాతథ స్థితినే కొనసాగించాలని ఎన్‌సీఎల్‌టీ ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇలావుండగా తమకు రుణ బకారుూలున్న వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు బ్రెజిల్, ఇండోనేషియాల్లో ఉన్న చమురు, సహజ వాయుల రంగ ఆస్తులను విక్రయించడం ద్వారా బకాయిలు రికవరీలు చేసేందుకు ఎస్‌బీఐ 3ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్2 (ఈఓఐ) పేరిట బిడ్లను ఆహ్వానించింది. ఈక్రమంలో ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన వీడియోకాన్ ఇండస్ట్రీస్ తమ కంపెనీ పరిధిలోని బ్రెజిల్, ఇండోనేషియా ఆస్తులను సైతం దివాళా నివారణ చట్ట పరిధిలోకి చేర్చాలని విజ్ఞప్తి చేసింది. కాగా వీడియోకాన్‌తోబాటు దాని 15 అనుబంధ కంపెనీలు రూ. 90 వేల కోట్ల రుణ బకారుూలతో బ్యాంకులను మోసగించిన అతిపెద్ద 40 కంపెనీల జాబితాలోకి చేరాయి.