బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచ్చి, సెప్టెంబర్ 9: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)ను ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో పునరుద్ధరిస్తామని కేంద్ర భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ సోమవారం నాడిక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణ కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని, ఈ దిశగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో ముందుకు రానుందన్నారు. ప్రధానంగా ఈ సంస్థ సక్రమంగా, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే నష్టాలు రావని స్పష్టం చేశారు. కొత్త ప్యాకేజీకి సంబంధించిన ప్రతిపాదనలను బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నతాధికారులు సమర్పించారని, అది ప్రస్తుతం తమ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని ఆయన వెల్లడించారు. 1995లో ప్రధానంగా బీఎస్‌ఎన్‌ఎల్ సమస్యల్లో చిక్కుకుందని, అప్పట్లో ఈ సంస్థను మూసివేసే పరిస్థితులు ఉండేవని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి దుస్థితి రానివ్వబోమని పత్రికలు, మీడియా కథనాలను ఉటంకిస్తూ ఆయన స్పష్టం చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌తోబాటు మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్) ఉన్నతాధికారులతో ఇప్పటికే నష్టాలు, ఇతర సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించామన్నారు. ఇటీవలి కాలంలో సిబ్బందికి జీతాలు ఇచ్చే విషయంలో కూడా ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన స్థితిని అధ్యయనం చేశామన్నారు. ఈ రెండు సంస్థలను అలాగే విడివిడిగా ఉంచాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు సైతం కోరాయని మేఘ్‌వాల్ తెలిపారు. ఇలావుండగా ప్రస్తుత వృద్థిరేటు దుస్థితి గురించి అడిగిన ప్రశ్నపై స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవడేకర్ మాట్లాడుతూ అది కేవలం తాత్కాలిక సమస్యేనని కొట్టిపారేశారు. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ఆచరణ రూపంలోకి తేవడం జరుగుతుందన్నారు. ఇందులో ఇప్పటికే బ్యాంకుల విలీనం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక చేయూత వంటివి అమలయ్యాయన్నారు. జమ్మూకాశ్మీర్ విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని దిగ్విజయవంతంగా అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

చిత్రం...కేంద్ర భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్