బిజినెస్

లాభాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : వారారంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఆర్థికాభివృద్ధి అవరోధాలను అధిగమిస్తామన్న భరోసాను ప్రభుత్వం కల్పించడంతో మదుపర్ల వైఖరిలో మార్పు వచ్చింది. పైనాన్షియల్, వాహన కౌంటర్లలో వాటాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు నష్టాల బాటలో గమ్యగోచరంగా ఉన్న స్టాక్ మార్కెట్లు సోమవారం మధ్యాహ్నం నుంచి గాడినపడ్డాయి. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 163.68 పాయింట్లు ఎగబాకి 0.44 శాతం లాభాలతో 37,145.45 పాయింట్ల ఎగువన స్థిరపడగా, బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56.85 పాయింట్ల ఆధిక్యతతో 0.52 శాతం లాభపడి 11,003.05 పాయింట్ల గరిష్ట స్ధాయిలో స్థిరపడింది. అంతర్జాతీయంగా మారిన సానుకూలతలు సైతం దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. వాహన రంగంతోబాటు పలు రంగాల్లో నెలకొన్న వృద్ధిరేటు మందగమనాన్ని అరికట్టేందుకు వివిధ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్న ప్రభుత్వ వైఖరి మదుపర్లలో సానుకూల దృక్పథాన్ని పాదుకొల్పిందని విశే్లషకులు పేర్కొంటున్నారు. సెనె్సక్స్‌లో మొత్తం 20 స్టాక్స్ లాభాల్లోనూ, 10 స్టాక్స్ నష్టాల్లోను నడిచాయి. ఈ ప్యాక్‌లో యెస్ బ్యాంక్, మారుతి, ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హీరోమోటోకార్ప్ అత్యధికంగా 4.47 శాతం లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ ఎం, బజాజ్ ఆటో, టీసీఎస్ 1.50 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో టెలికాం, కేపిటల్ గూడ్స్, పరిశ్రమలు, వినిమయ వస్తువులు, బ్యాంకెక్స్, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్ సూచీలు 0.81 శాతం నష్టపోయాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.97 శాతం లాభపడ్డాయి. ఇలావుండగా ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలనే మూటగట్టుకున్న సెనె్సక్స్ ఓ దశలో 36,784.47 అత్యల్ప స్థాయికి చేరుకుని ఆ తర్వాత ఏకంగా 460 పాయింట్లు ఎగబాకి లాభాల్లోకి వచ్చింది. అలాగే నిఫ్టీ సైతం ఓ దశలో 10,889.80 పాయింట్ల కనిష్టానికి చేరి అనంతరం 11,028.85 గరిష్టాన్ని స్పృశించింది. ప్రధానంగా సంక్షోభంలో చిక్కుకున్న వాహన రంగాన్ని జీఎస్‌టీ తగ్గింపు వంటి అన్ని రకాల చేయూతతో ఆదుకుంటామని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ హామీ ఇవ్వడం, 2024-25 సంవత్సరంలోగా రూ. 100 కోట్ల ఖర్చు అంచనాలతో వౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టేందుకు గల అవకాశాలను కనుగొనేందుకు హైలెవల్ టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం మార్కెట్లకు ఊతమిచ్చిందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. లాభాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో నడిచాయి. షాంఘై కాంపోజిట్ సూచీ, నిక్కీ, కోస్పి లాభాలను నమోదు చేయగా, హ్యాంగ్‌సెంగ్ మాత్రం నష్టాలను సంతరించుకుంది. ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం కేవలం ఒక్క పైసా పెరిగి 71.71గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు 0.80 శాతం పెరిగి బ్యారెల్ 62.03 డాలర్ల వంతున ట్రేడైంది.