బిజినెస్

మేమే బెటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 10: అంతర్జాతీయంగానూ, దేశీయంగానూ ఉద్యోగులపై ఉన్నతాధికారులు (బాస్‌లు) ప్రేమానుక్తులతో మెలుగుతున్నప్పటికీ ఉద్యోగుల్లో మాత్రం అధిక శాతం మంది తమ బాస్‌లు నిర్వర్తించే విధులను తామే అంతకంటే మిన్నగా చేయగలమన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. మహిళా ఉద్యోగుల్లో 73 శాతం, పురుష ఉద్యోగుల్లో 70 శాతం మంది ఈ రకమైన నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. అంతర్జాతీయ అధ్యయన సంస్ధ ‘వర్క్ ఫోర్స్ ఇన్‌స్టిట్యూట్ అట్ క్రోనోస్ ఇన్‌కార్పొరేటెడ్ అండ్ ఫ్యూచర్స్’ ఈ మేరకు ‘్భవిష్యత్ పనిస్థలం’ పేరిట సర్వేని నిర్వహించింది. గత ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 9 వరకు భారత్‌తోబాటు, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లోని మొత్తం మూడు వేలమంది ఉద్యోగులను కలిసి ఆ సంస్థ ప్రతినిధులు అభిప్రాయ సేకరణ చేశారు. ఈ మేరకు సీ,డీ లేదా ఎఫ్ గ్రేడు ఉద్యోగుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు తన మేనేజర్ కంటే తానే ఆ విధులను మరింత నైపుణ్యంగా నిర్వర్తించగలనన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆ మేనేజర్ కేవలం 37 శాతం సామర్థతతో పనిచేస్తున్నారని, ఉద్యోగులను మరింత సమర్థవంతంగా పనిచేసేలా తర్ఫీదు ఇవ్వడంలో 37 శాతం, సమస్యల పరిష్కారం విషయంలో 33 శాతం, పరస్పర సమాచార బంధాల్లో 33 శాతం సమర్థతను మాత్రమే వారి మేనేజర్లు వినియోగిస్తున్నారని ఆ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. మొత్తం నిర్వహణ సామర్థ్యం విషయంలో మెజారిటీ శాతం కార్మికులు తమ బాస్‌లకు పాస్ మార్కులు ఇస్తూ ఏ (26 శాతం), బీ (37 శాతం), సీ (25 శాతం) గ్రేడింగ్ ఇచ్చారు. కేవలం నలుగురు మాత్రమే ‘ఎఫ్’ గ్రేడ్ ఇచ్చారు. కాగా బారతీయ ఉద్యోగుల్లో అధిక శాతం తమ బాస్‌ల పనిసామర్థ్యంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. 10 మందిలో కనీసం 8 మంది ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు ఏ లేదా బీ గ్రేడింగ్ ఇచ్చారు.