బిజినెస్

చమురు, సహజ వాయువుల అనే్వషణకు ఓఎన్‌జీసీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహటి, సెప్టెంబర్ 11: ఓఎన్‌జీసీ నేతృత్వంలో అస్సాంలో చమురు, సహజవాయువుల అనే్వషణ (ఎక్స్‌ప్లోరింగ్) విస్తృత స్ధాయిలో జరుగనుంది. ఈ క్రమంలో రానున్న ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 13వేల కోట్ల పెట్టుబడితో 220 బావుల తవ్వకాన్ని నిర్వహించనున్నట్టు బుధవారం నాడిక్కడ ఆ కం పెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి అస్సాం ప్రభుత్వంతో మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఓయూ) కుదుర్చుకున్నట్టు తెలిపింది. అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ బా వుల తవ్వకాలకు ఓఎన్‌జీసీ పూర్తి స్థాయిలో పరికరాలను అందజేస్తుంది. 2022 నాటికి మనదేశ చ మురు, సహజవాయువుల దిగుమతులు 10 శాతం తగ్గాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తమ వంతు కృషి చేస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. అలాగే ‘ఈశాన్య హైడ్రోక్బాన్ విజన్ 2030’ లక్ష్యం మేరకు కృషి చేస్తామని తెలిపింది.