బిజినెస్

వాటాలు విక్రయించిన అజీమ్ ప్రేమ్‌జీ, ప్రమోటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: విప్రో బైబ్యాక్ ఆఫర్ సందర్భంగా ‘అజిమ్ ప్రేమ్‌జీ’తోబాటు ఇతర ప్రమోటర్లు మొత్తం రూ. 7,300 కోట్ల విలువైన 22.46 కోట్ల వాటాలను విక్రయించారు. ఈ ఆఫర్ గత నెలాఖరుతో ముగిసిపోయింది. కాగా మొ త్తం 32.3 కోట్ల వాటాలను ఒక్కో వాటా రూ. 325 వంతున తమ కంపెనీ తిరిగి కొనుగోలు చేసిందని విప్రో బుధవారం నాడిక్కడ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇందుకు సంబంధించి రూ. 10,499.99 కోట్ల మొత్తాన్ని వెచ్చించినట్టు ఆ కంపెనీ తెలిపింది. దాదాపుగా 6.12 కోట్ల వాటాలను అజీమ్‌ప్రేమ్‌జీ భాగస్వామి జెష్ ట్రేడర్స్ నుంచి, అలాగే 6.03 కోట్ల వాటాలను అజీమ్‌ప్రేమ్‌జీ మరోభాగస్వామి ప్ర మ్‌జిమ్ ట్రేడర్స్ నుంచి, 5.02 కోట్ల వాటాలను అజీమ్‌ప్రేమ్‌జీ మరో భాగస్వామి హషామ్ ట్రేడర్స్ నుంచి బైబ్యాక్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేశామని తెలిపింది. దాదాపు 4.05 కోట్ల వాటాలను అజీమ్‌ప్రేమ్‌జీ ట్రస్ట్ నుంచి, 1.22 కోట్ల వాటాలను అజిమ్ ప్రేమ్‌జీ నుంచి నేరుగా కొనుగోలు చేశామని తెలిపింది. ఇలావుండగా జీవిత భీమా సంస్థ (ఎల్‌ఐసీ) 1.34 కోట్ల వాటాలను ఆఫర్ సందర్భంగా విక్రయించింది.