బిజినెస్

సులభతర వ్యాపారంలో ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పరిస్థితులను దేశం ఒక అవకాశంగా మలుచుకోవచ్చని ఏపీ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అభిపాయపడ్డారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో విదేశీ వ్యాపారంపై కేంద్ర ట్రేడ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉన్నత అధికారులు హాజరయ్యారు. సులభతర వ్యాపార నిర్వహణలో మెరుగైన లాజిస్టిక్స్ విభాగంలో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించిన జ్ఞాపికను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర మంత్రి గౌతమ్‌రెడ్డికి అందజేశారు. సమావేశం తరువాత గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ మెరుగైన లాజిస్టిక్, వౌలిక రంగాలలో వచ్చే ఏడాది నాటికి ఏపీని మొదటి స్థానంలో నిలవడమే తమ ముందున్న లక్ష్యమని ప్రకటించారు. ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి , సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల క్లస్టర్ల అభివృద్ధికి కేంద్ర సహకరించాలని సమావేశంలో కోరినట్టు చెప్పారు. కేంద్రం తక్షణమే మెరైన్-సీ పాలసీని రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పరిస్థితులను ఒక అవకాశంగా మలచుకోవచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం వల్ల ఆ రెండు దేశాల నుంచి పరిశ్రమలు తరలి వెళ్తున్నాయని వివరించారు. ఈ పరిశ్రమలను అకర్షించేందుకు జీఎస్టీ వంటి పన్నుల విషయంలో రాయితీలు ఇవ్వలన్నారు. దీనిపై కేంద్రం వెంటనే విధానపరమైన నిర్ణయం తీసుకోవలని కోరారు. తద్వారా ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే ఎలక్ట్రానిక్స్, సెల్‌ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లలో దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం వుందన్నారు. గత ప్రభుత్వం ఐటీకి అనువుగాని మంగళగిరిలో ప్రోత్సహించి విఫలమైందన్నారు. దీని మూలంగా రాష్ట్రానికి రావాల్సిన ఐటీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని గుర్తుచేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్ట చేశారు. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. ఆక్వా నాణ్యత ప్రమాణాలు సర్ట్ఫికేషన్ కోసం, దానికి సంబంధించిన ల్యాబ్‌లు రాష్ట్రంలో లేవని, అందువల్ల ఆక్వా ఉత్పత్తులను అనుకున్న స్థాయిలో ఎగుమతి చేయడం సాధ్యపడటం లేదని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆక్వా ఉత్పతుల సర్ట్ఫికేషన్ ల్యాబ్‌ను కాకినాడ లేదా విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి వెల్లడించారు.
*చిత్రం...కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి జ్ఞాపికను స్వీకరిస్తున్న ఏపీ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి